రాజమౌళి పుణ్యమా అని తెలుగు తారకలకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుంది.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో సెలబ్రిటీలు మన హీరోలకు ఫిదా అవుతున్నారు. మనవాళ్ల నటనకు సలాం కొడుతున్నారు. తాజాగా ఓ జపాన్ మంత్రి మన హీరో నటనకు ఫిదా అయ్యాడు.
తెలుగు సినిమాకు ఉన్నత స్థాయిని తెచ్చిపెట్టాడు రాజమౌళి. ఆయన చేసిన రెండు సినిమాలు తెలుగు సినిమానే కాదు.. ఇండియన్ సినిమానే ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది. ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చంది. మన తెలుగు సినిమా స్థాయిని మరోసారి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మరోసారి చాటి చెప్పిన సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్ చరిత్రలో నిలిపింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ నుంచి ఇప్పటి వరకూ.. ఏదో ఒక రకంగా రికార్డ్ లు క్రియేట్ చేస్తూ వస్తోంది. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టించిన ఈసినిమా తో అటు రామ్ చరణ్.. ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు హాలీవుడ్ రేంజ్ లో క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇద్దరు హీరోలు సెలబ్రిటీల మన్ననలు కూడా పొందుతున్నారు. రామ్ చరణ్ నటనను అవతార్ దర్శకుడు జేమ్స్ కామరూన్ లాంటి ఉద్దండులు మెచ్చుకుని శభాష్ అనగా.. తారక్ ఆస్కార్ వేడుకల్లో ఎక్కువగా జనాలు మాట్లాడుకున్న యాక్టర్ గా రికార్డ్ సృష్టించారు. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాతో.. గ్లోబల్ స్టార్ హీరోలుగా మారిపోయారు.ప్రత్యేకించి సినిమాలో తారక్‌పై వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతు టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచాయి.
తాజాగా ఈమూవీ జపాన్‌లో రిలీజ్ అయ్యింది. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ..కలెక్షన్స్ సాధిస్తోంది మూవీ. జపాన్ లో మన ఇండియన్ సినిమాలు.. ముఖ్యంగా మన తెలుగు సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంద. ఆర్ఆర్ఆర్ తరువాత అది ఇంకా ఎక్కువయ్యింది. ముఖ్యంగా ఎన్టీఆర్ క్రేజ్ అక్కడ అంతకంతకూ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే తారక్ జపాన్‌లో మోస్ట్ లవింగ్ ఇండియన్ యాక్టర్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని జపనీస్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి యోషిమాస హయషి స్వయంగా వెల్లడించడం విశేషం. ఆర్‌ఆర్‌ఆర్‌లో నాటు నాటు సాంగ్‌తో ఇరగదీసిన ఇద్దరు యాక్టర్లున్నాయి. వీరిలో నా ఫేవరేట్ యాక్టర్ ఎవరంటే జూనియర్ ఎన్టీ రామారావు అని చెబుతానన్నారు. జపనీస్ మంత్రి నోట వచ్చిన తారక్ మాటకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అత్యున్నత ఆస్కార్ తో పాటు మరికొన్ని పురస్కారాలను అందుకున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమ్రంభీంగా నటించాడు. అలియాభట్, అజయ్ దేవ్‌గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని లాంటి తారలు ఇతర కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కించిన ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర 1300 కోట్లకుపైగా కలెక్షన్లు వసూలు చేసింది.
