ముంబైలో అతిపెద్ద పెళ్లి వేడుక నెలకొంది. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ల వివాహం ఘనంగా జరుగుతుంది. బాలీవుడ్ స్టార్స్ ఈ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. కాగా ఈ వేడుక కోసం సరికొత్తగా ముస్తాబైన జాన్వీ కపూర్ ధరించిన హారం ధర హాట్ టాపిక్ అవుతుంది.
ముంబై వేదికగా శ్రీమంతుడు వివాహం జరుగుతుంది. ఆసియాలోనే అతిపెద్ద కోటీశ్వరుడైన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాలీవుడ్ తారలు ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సందడి చేస్తున్నారు. గుజరాతీ సాంప్రదాయం ప్రకారం ఇటీవల మామేరు వేడుక నిర్వహించారు. దీనికి జాన్వీ కపూర్ హాజరయ్యారు. పెళ్లి కావడంతో ట్రెడిషనల్ వేర్ ఎంచుకున్నారు. ఆరంజ్ కలర్ డిజైనర్ చోళీ లెహంగా, దుప్పట్టాలో ఆమె మెరిశారు.
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో జాన్వీ కపూర్ ధరించి హారం హాట్ టాపిక్ అవుతుంది. పెద్ద పెద్ద స్టోన్స్ తో కూడిన సదరు నెక్లెస్ హజారీలాల్ లీగసి జ్యువెలరీ బ్రాండ్ కి చెందినది. దాని ధర ఏకంగా రూ. 50 లక్షలు అట. జస్ట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు రూ. 50 లక్షల హారం ధరించిన జాన్వీ... పెళ్ళికి ఎంతటి ఖరీదైన బట్టలు, నగలు ధరిస్తుందో అనే చర్చ నడుస్తోంది. కాగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలకు జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో రావడం విశేషం.
మరోవైపు సౌత్ లో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తుంది జాన్వీ కపూర్. ఎన్టీఆర్ కి జంటగా నటిస్తున్న దేవర చిత్రీకరణ చివరి దశలో ఉంది. సమ్మర్ కి విడుదల కావాల్సిన దేవర దసరాకు వాయిదా పడింది. అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయనున్నారు. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓ కీలక రోల్ చేస్తున్నారు.
అలాగే రామ్ చరణ్ 16వ చిత్రానికి జాన్వీ కపూర్ సైన్ చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. బాలీవుడ్ లో ఇంతవరకు ఒక్క స్టార్ హీరో పక్కన కూడా నటించని జాన్వీ కపూర్ సౌత్ లో పాన్ ఇండియా హీరోలతో జతకడుతుంది.
