ఇటీవలి కాలంలో విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న సినిమా 'RX100'. మొదట ఈ సినిమాపై డివైడ్ టాక్ వచ్చినప్పటికీ యూత్ ఈ కథకు కనెక్ట్ అవ్వడంతో సినిమా విజయం అందుకుంది. రెండింతల లాభాలని తీసుకొని నిర్మాతలను ఖుషీ చేసింది. కార్తికేయ, పాయల్ జంటగా నటించిన ఈ సినిమాకు సంబంధించిన ఒక స్టిల్ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. సినిమాలో ఓ సన్నివేశంలో హీరో పోలీస్ మీద తిరగబడుతుంటాడు. ఆ సమయంలో హీరో వెనుక ఉన్న గోడ మీద జనసేన అని రాసి ఉంది. అది చూసిన పవన్ అభిమానులు ఫోటోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి హీరో కార్తికేయని ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించాడు. 'అదెలా పట్టావ్ బ్రో.. ఇన్ డైరెక్ట్ గా ఆయన(పవన్ కళ్యాణ్) బ్లెస్సింగ్స్ ఉన్నాయేమో మరి' అంటూ ట్వీట్ చేశాడు.

ఈ పోస్ట్ చూసిన పవన్ ఫ్యాన్స్ కార్తికేయని సపోర్ట్ చేస్తూ మంచి కథలతో సినిమాలు చేయండి.. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు థియేటర్లలో సత్తా చాటిన 'RX100' సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ప్రత్యక్షమైంది!