శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ మెస్మరైజింగ్ స్టెప్స్ తో సోషల్ మీడియాను షేక్ చేశారు. తన లేటెస్ట్ మూవీలోని ఓ సాంగ్ కి జాన్వీ కపూర్ స్టెప్స్ హాట్ అండ్ సెక్సీగా ఉన్నాయి. జాన్వీ కపూర్ లేటెస్ట్ సాంగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రూహి. కామెడీ అండ్ హారర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావ్ హీరోగా నటిస్తున్నారు. 


ఈ మూవీలోని నదియాన్  పార్ అనే సాంగ్ చిత్ర యూనిట్ విడుదల చేశారు. గోల్డ్ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ ధరించిన జాన్వీ చాలా సెక్సీగా ఉన్నారు. ఫాస్ట్ బీట్ సాంగ్ లో జాన్వీ స్టెప్స్ కట్టిపడేస్తున్నారు. యూట్యూబ్ లో విడుదలైన ఈ సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న రూహి మూవీ సమ్మర్ కానుకగా వచ్చే ఏడాది విడుదల కానుంది. 


దర్శకుడు హార్దిక్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా... సచిన్-జిగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా జాన్వీ దోస్తానా 2 మరియు జెర్రీ అనే మరో రెండు హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. చేసింది తక్కువ చిత్రాలే అయినా పాపులారిటీ బాగా తెచ్చుకున్నారు జాన్వీ కపూర్.