Asianet News TeluguAsianet News Telugu

ప్రేమలో పడిన జాన్వీకపూర్ సోదరి, వైరల్ అవుతున్న రొమాంటిక్ ఫోటో..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీకపూర్ సోదరి ప్రేమలో పడింది. అవును ఇది నిజంత.. జాన్వీ సిస్టర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడమే కాదు.. అపీషియల్ గా ఈ విషయాన్ని వెల్లడిస్తూ..ఇన్ స్టాలో రొమాంటిక్  పోస్ట్ కూడా పెట్టింది. 

Janhvi Kapoor Sister Anshula Kapoor Relationship With Rohan Thakkar JMS
Author
First Published Mar 28, 2023, 7:04 PM IST

బాలీవుడ్ లో ప్రేమలు బ్రేకప్ లు కామన్.. మేము ప్రేమలో పడ్డాం అని చెప్పుకుంటారు.. విడిపోతున్నాం అని కూడా.. గోప్పగానే ప్రకటించుకుంటారు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ ప్రొడ్యూసర్ కూతురు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ సోదరి ప్రమలో పడింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసింది. ఇంతకీ జాన్వీ సోదరి అనగానే ఖుషీ కూపూర్ అనుకున్నారు కదా.. అంతా..? కాని ప్రేమలో పడింది ధఆమె మాత్రం కాదు. 

బాలీవుడ్  స్టార్ ప్రోడ్యూసర్లలో  బోనీకపూర్​ ఒకరు. అతిలోక సుందరి శ్రీదేవిపెళ్లి చేసుకోవడంతో.. సౌత్ ఇండస్ట్రీకి అల్లుడిగా మారిపోయాడు. ఇక్కడి సినిమాలు బాలీవుడ్ లో చేస్తూ.. సౌత్ సినిమాలను కూడా నిర్మిస్తూ.. దూసుకుపోతున్నాడు. ఇక  బోనీకపూర్ కు శ్రీదేవికంటే ముందే పెళ్ళి జరిగిపోయింది. ఆయన తనయుడు అర్జున్ కపూర్ హీరోగా కోనసాగుతుండగా.. అన్జున్ కపూర్ కు ఓ చెల్లెలు కూడా ఉంది. ఆమె  అన్షులా కపూర్. ప్రస్తుతం  ప్రేమలో పడింది ఈ అమ్మాయే. ప్రముఖ  స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్​తో ఆమె డేటింగ్​లో ఉన్నట్లు కొన్నాళ్లుగా బాలీవుడ్ లో  జోరుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో... ఇది నిజమే అని ప్రకటించింది బ్యూటీ.  

 

తన రిలేషన్ ను  కన్ఫర్మ్ చేస్తూ అన్షులా  కపూర్ సోషల్ మీడియాలో.. ఓ ఫోటోను శేర్ చేసింది. తన  ప్రియుడు రోహన్ థక్కర్ తో స్విమ్మింగ్ పూల్​లో దిగిన ఒక రొమాంటిక్ ఫొటోను ఇన్ స్టాలో పంచుకుంది బ్యూటీ. ఆ ఫొటోకు హార్ట్ ఎమోజీతో 366 అని క్యాప్షన్ జత చేసింది. అంతేకాదు వీరిద్దరు  మాల్దీవుల్లో  ఉన్నట్లు  తెలుస్తోంది.  ఈ పోస్ట్ కు మాల్దీవుల లొకేషన్ ను కూడా ​ ట్యాగ్​ చేసింది అన్షూ. ఈ పోస్ట్ తో బాలీవుడ్ లో పెద్ద చర్చ స్టార్ట్ అయ్యింది. ఇక నెటిజన్లు మాత్రం వరుసగా కామెంట్లు మొదలెట్టారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. శుభాకాంక్షలు కూడా చెపుతున్నారు సినీ జనాలు. 

ఇక ప్రోడ్యూసర్ బోనీకపూర్ విషయానికి వస్తే.... ఆయన తమ్ముడు అనిల్ కపూర్​ హీరోగా..ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. అంతే కాదు ఆయన తనయుడు  అర్జున్​ కపూర్​తో కూడా హిట్ సినిమాలు చేశాడు  కొన్ని విజయవంతమైన సినిమాలు తీశారు. ఇప్పుడు సౌత్ సినిమా వైపు దృష్టి ఎక్కువగా పెట్టాడు. తమిళ స్టార్ అజిత్​తో వలిమై లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను రూపొందించారు బోనీ కపూర్. సౌత్​ స్టార్స్​తో మరిన్ని సినిమాలు తీసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios