రీసెంట్ గా అనంత్ అంబానీ వెడ్డింగ్ లో జాన్వీ కపూర్ మైండ్ బ్లోయింగ్ అనిపించే గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసింది. జాన్వీ కపూర్ ని ఈ డ్రెస్ లో చూస్తుంటే దేవకన్య లాగే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

జాన్వీ కపూర్ కి సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా విజయాలు లేవు. కానీ గ్లామర్ తోనే ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. శ్రీదేవి కుమార్తె అనే బ్రాండ్ ఎలాగూ ఉంది కాబట్టి జాన్వీ కపూర్ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. బాలీవుడ్ లో గ్లామర్ పరంగా ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న హీరోయిన్ జాన్వీ కపూర్ అనే చెప్పాలి. 

రీసెంట్ గా అనంత్ అంబానీ వెడ్డింగ్ లో జాన్వీ కపూర్ మైండ్ బ్లోయింగ్ అనిపించే గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసింది. జాన్వీ కపూర్ ని ఈ డ్రెస్ లో చూస్తుంటే దేవకన్య లాగే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ధగధగ మెరుపులతో జాన్వీ మహారాణిలా ఎంట్రీ ఇచ్చింది. 

ఈ ఫోటోలని జాన్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారాయి. అయితే జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. నార్త్ లో జాన్వీకి సూపర్ క్రేజ్ ఉంది. తన క్రేజ్ తో దేవర చిత్రాన్ని జాన్వీ మరింతగా ప్రమోట్ చేస్తోంది. 

View post on Instagram

ఈ మూవీలో జాన్వీ పాత్ర పేరు 'తంగం'. తన పాత్ర బాగా రీచ్ అయ్యేలా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అంబానీ వెడ్డింగ్ కి ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'తంగం' అనే హ్యాష్ ట్యాగ్ పెట్టింది. దీనితో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది.