గడిచిన రాత్రి అమ్మతో గడిపా: జాన్వీ కపూర్

janhvi kapoor on the last night she spent with mom sridevi
Highlights

దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ త్వరలోనే 'ధడక్' చిత్రం ద్వారా బాలీవుడ్ లో 
 

దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ త్వరలోనే 'ధడక్' చిత్రం ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. తన తల్లి మరణాంతరం జాన్వీ మీడియా ముందుకు పెద్దగా వచ్చిన సందర్భాలేవీ లేవు. తాజాగా ఓ ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ  గడిచిన రాత్రి తన తల్లితో సమయం గడిపినట్లు  కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

''అమ్మ పెళ్లికి వెళ్లడానికి ముందురోజు నేను షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చింది. సరిగ్గా నిద్ర కూడా లేదు.. ఇంటికి వెళ్లిన తరువాత వచ్చి నన్ను పడుకోబెట్టు అని అమ్మని అడిగాను. కానీ తను ప్యాకింగ్ లో బిజీగా ఉండడంతో నా దగ్గరకి రాలేకపోయింది. నేను సగం నిద్రలో ఉండగా వచ్చి నా తల నిమురుతూ జో కొట్టి నిద్రబుచ్చింది'' అని  వెల్లడించిన జాన్వీ ఇప్పటికీ అమ్మ స్పర్శను ఫీల్ అవుతూనే ఉంటానని చెప్పుకొచ్చింది.

ఆమె భౌతికంగా నాతో లేకపోయినా ఇప్పటికీ నిద్రపోయే ముందు ఆమె నా తల నిమురుతున్నట్లే అనిపిస్తుందని అన్నారు. తన చెల్లెలు ఖుషి కపూర్ ఇప్పుడు తన బాధ్యతలు తీసుకుందని.. నన్నొక చిన్న పాపల చూసుకుంటుందని కొన్నిసార్లు తనే నన్ను నిద్రబుచ్చుతుందని వెల్లడించారు. గతంలో శ్రీదేవి ఓ సందర్భంలో తన పిల్లల గురించి మాట్లాడుతూ.. ఇప్పటికీ జాన్వీ అన్ని విషయాలకు తన సహాయం కోరుతుందని.. ఖుషి మాత్రం తన మీద అసలు డిపెండ్ అవ్వదని అన్నారు.
 

loader