Asianet News TeluguAsianet News Telugu

లంగా ఓణీలో జాన్వీ కపూర్ సొగసుల జాతర, దేవర షూటింగ్ లో బాలీవుడ్ బ్యూటీ.

లంగ ఒణీలో.. అచ్చమైన తెలుగు పిల్లలా అదిరిపోయే స్టిల్ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. దేవర సినిమా కు సబంధించిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

Janhvi Kapoor Latest Pic From Ntr Devara Movie Shooting JMS
Author
First Published Nov 1, 2023, 8:40 AM IST

లంగ ఒణీలో.. అచ్చమైన తెలుగు పిల్లలా అదిరిపోయే స్టిల్ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. దేవర సినిమా కు సబంధించిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ప్రస్తుత గోవాలో  దేవర మూవీ షూటింగ్ లాంగ్ షెడ్యూల్ ను జరుపుకుంటోంది. ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్ మధ్య రొమాంటికి సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో కంప్లీట్ చేయబోతున్నారట టీమ్. అంతే కాదు ఈ షెడ్యుల్ లోనే మెయిన్ కాస్ట్ తో కూడా కొన్ని సీన్లు ఉంటాయని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ షూటింగ్ కు సంబంధించిన ఓ అప్ డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న హీరోయిన్ జాన్వీ లుక్ తాజాగా రిలీజ్ అయ్యింది. 

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఏదైన పోస్ట్ పెట్టినా.. గ్లామర్ ఫోటోలు అప్ లోడ్ చేసినా.. అవి బ్లాస్టింగ్ రిజల్ట్ ను ఇస్తుంటాయి. అటువంటిది దేవర సినిమా నుంచి జాన్వీ కపూర్ స్టిల్.. అది కూడా హాట్ హాట్ గా ఉన్న పోస్టర్ రిలీజ్ అయ్యిందంటే.. అది వైరల్ కాకుండా ఎలా ఉంటుంది. తాజాగా జాన్వీ కపూర్ లంగా ఓణీలో ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటోను జాన్వీ స్యవంగా తన ఇన్ స్టా ఫేజ్ లో కూడా పంచుకుంది.  దేవర సినిమాలో చేపలు పట్టే ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా జాన్వీ నటిస్తోంది. 

 

ఇక ఈ పోస్టర్ లో జాన్వీ చాలా హాట్ గా కనిపిస్తోంది. లంగా ఓణీలో.. నడుముపై చేతులు పెట్టుకుని.. చిరునవ్వులుచిందిస్తూ.. నడుమాందాలు చూపిస్తూ.. కాస్త పైట పక్కకుజరిగి.. అద్భుతమైన ఫోజ్ ఇచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు జాన్వీ అభిమానులు రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు. 

ఇక ఎన్టీఆర్ జోడీగా... దేవర సినిమా ద్వారా సౌత్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీ కపూర్. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా మారాలని ప్లాన్ తో ఉంది. ఇక కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండగా.. తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

  

Follow Us:
Download App:
  • android
  • ios