సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై నెటిజన్ల దృష్టి బాగా పెరిగిపోయింది. అందుకే ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలు ఆచితూచి పోస్ట్ లు పెడుతుంటారు. ఏమాత్రం తేడా కొట్టినా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

తాజాగా నెటిజన్ల ట్రోలింగ్ కి బలైంది నటి జాన్వీ కపూర్. గతంలో చాలా సార్లు తన బట్టల విషయంలో ట్రోలింగ్ కి గురైన జాన్వీని మరోసారి నెటిజన్లు టార్గెట్ చేశారు. ఫ్యాషన్ ట్రెండ్స్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న జాన్వీ ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ లో పాల్గొంటూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.

తాజాగా ఆమె కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం హోలోగ్రఫిక్ ఎఫెక్ట్ ఉండే వంకాయ రంగు డ్రెస్ వేసుకుంది. ఈ డ్రెస్ లో జాన్వీ చాలా అందంగా ఉంది కానీ ఆ హోలోగ్రఫిక్ డిజైన్ కాపీ అంటూ కొందరు ఫ్యాషన్ ప్రియులు జాన్వీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఇంటర్నేషనల్ గా పాపులర్ అయిన బాల్మెయిన్ ఫాల్ 2018 కలెక్షన్ లో ఓ మోడల్ వేసుకున్న హోలోగ్రఫిక్ ఎఫెక్ట్ డ్రెస్ ని జాన్వీ కాపీ చేసిందంటూ ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై జాన్వీ స్పందించలేదు.