అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన అందాల భామ జాన్వీ కపూర్‌. దడక్‌ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే స్టార్ ఇమేజ్‌ అందుకుంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ చిన్నతనంలో చేసిన అల్లరి పనులకు సంబంధించి విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. చిన్నతనంలో జాన్వీ చాలా చిలిపి పనులు చేసేదని ఆమె బాల్య స్నేహితురాలు తనీషా సంతోషి వెల్లడించింది.

ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న తనీషా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చిన్నప్పుడు జాన్వీ చాలా అల్లరి చేసేదని ముఖ్యంగా ఫ్రెండ్స్‌తో కలిసి హోటల్స్‌కు ఇతర ప్లేస్‌లకు వెళ్లేప్పుడు చేసే అల్లరి పనుల కారణంగా తాను కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పింది తనీషా. హోటళ్లకు వెళ్లినప్పుడు అక్కడున్న అక్వేరియంల నుంచి చేపలను రాళ్లను జాన్వీ దొంగలించేదని చెప్పింది తనీషా.

అలా దొంగలించిన చేపలు తన ఇంట్లోని అక్వేరియంతో పెంచుకునేదని తెలిపింది. అయితే జాన్వీ చేసిన ఈ అల్లరి పనుల కారణంగా తాను చాలా సార్లు బుక్‌ అయ్యానని గుర్తు చేసుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జాన్వీ బయోగ్రాఫికల్ మూవీగా తెరకెక్కుతున్న గుంజన్‌ సక్సెనా, దోస్తానా 2 సినిమాల్లో నటిస్తోంది. లాక్‌ డౌన్‌ కారణంగా ఈ సినిమాల షూటింగ్‌లు వాయిదా పడటంతో ఇంటికే పరిమితమైంది జాన్వీ.