బయోపిక్ ల సీజన్ బాలీవుడ్ లో కంటిన్యూ అవుతోంది. దాంతో చిన్నా,పెద్దా, కొత్త, పాత నటీనటులంతా ఈ బయోపిక్ లలో ఆఫర్స్ సంపాదిస్తున్నారు. తాజాగా శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్  సైతం ఓ బయోపిక్ లో కీ రోల్ చేస్తున్నారు.   తొలి చిత్రం ‘ధడక్’తోనే బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న  జాన్వి కపూర్ ప్రస్తుతం ఆ చిత్రం ప్రిపరేషన్ లో ఉంది‌.  ఈ రెండో సినిమా కూడా ప్రముఖ బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించటం విశేషం.

అందుతున్న సమాచారం ప్రకారం చారిత్రక చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘తఖ్త్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో జాన్వి ప్రధాన పాత్రలో నటించనున్నారు. కాగా ఇప్పుడు జాన్వి తొలి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌ గుంజన్‌ సక్సేనా పాత్రలో నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. 

భారత్‌కు చెందిన మొదటి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా కరణ్‌ జోహార్‌ ఈ బయోపిక్‌ని నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. గుంజన్‌ 1999 కార్గిల్‌ యుద్ధంలో పాల్గొని విశేష సేవలందించారు. ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలకు శౌర్యవీర్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఇందులో గుంజన్‌ సక్సేనాగా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారు.

ఈ నేపథ్యంలో జాన్వి, గుంజన్‌ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో  వైరల్‌ అయ్యింది. ఐఏఎఫ్‌ విమానం నడిపిన తొలి భారతీయ మహిళ గుంజన్‌. 1999 కార్గిల్‌ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను గుంజన్‌ తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి అందరి మన్ననలు పొందారు.

‘తఖ్త్‌’ చిత్రీకరణ వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో జాన్వితో పాటు ఆలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌, విక్కీ కౌశల్‌, కరీనా కపూర్‌, భూమి పెడ్నేకర్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.‌