విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ పత్రాలకు జత చేసిన అఫిడవిట్ లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆయన గురువారంనాడు గాజువాక శాసనసభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

నామినేషన్ పత్రాలకు జత చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో పవన్ తన ఆస్తులు, అప్పుల గురించి  తెలియజేశారు. తన అన్నయ్య భార్య సురేఖకు కోటి రూపాయలు బాకీ పడ్డట్టు ఆయన తెలిపారు. అదే విధంగా దర్శకుడు త్రివిక్రమ్‌కు రూ.2.4 కోట్లు అప్పు కట్టాల్సి ఉన్నట్లు అఫిడవిట్‌లో పవన్ తెలిపారు. 

తనకున్న మొత్తం అప్పు రూ.33 కోట్లుగా జనసేన అధినేత వెల్లడించారు. స్థిర, చరాస్థులు కలిపి మొత్తం తన ఆస్తి రూ.52కోట్లుగా పవన్ కల్యాణ్ చెప్పారు. తనకు ఐదు ఖరీదైన కార్లు ఉన్నట్లు పవన్ తెలిపారు. 

కోటి రూపాయల ఖరీదైన వోల్వో ఎక్స్‌సీ 90, 72లక్షల విలువైన మెర్సెడ్స్ బెంజ్ ఆర్ కారు, టయోటా ఫార్చునర్, స్కోడా ర్యాపిడ్, మహీంద్ర స్కార్పియో కార్లు, 32లక్షల ఖరీదైన హార్లీడేవిడ్‌సన్ హెరిటేజ్ సాఫ్టైల్ బైక్ ఉన్నట్లు ఆయన అఫిడవిట్‌లో తెలిపారు.

అలాగే సినీ ప్రొడక్షన్ హౌస్ ల నుంచి సినీ ప్రముఖుల నుంచి పవన్ చేసిన అప్పులు విధంగా ఉన్నాయి. 

హారిక హాసిని ప్రొడక్షన్స్: 1.25కోట్లు 

M ప్రవీణ్ కుమార్ - 3కోట్లు 

MVRS ప్రసాద్: 2 కోట్లు 

శ్రీ బాలాజీ సినీ చిత్ర మీడియా: 2 కోట్లు 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్: 0.27కోట్లు

 వై.నవీన్ కుమార్ - 5.50కోట్లు