పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. పవన్ తన రాజకీయాలు వదులుకొని సినిమాల్లో నటిస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలో ఓ లెటర్ కూడా సర్క్యులేట్ అయింది. దీంతో పవన్ టీం స్పందించక తప్పలేదు.  సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల్లో నిజం లేదని జనసేన పార్టీ స్పష్టం చేసింది. పవన్ పేరిట ప్రచారం అవుతోన్న ఆ లేఖ కట్టుకథలతో కూడినదని పేర్కొంది.

జనసేనానికి ఉన్న అభిమానగణం, ఆయన పేరుతో జరుగుతోన్న సేవా కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొందరు ఈ విధంగా తప్పుడు లేఖలు సృష్టిస్తున్నట్లు తమ పార్టీ దృష్టికి వచ్చిందంటూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ విషయమై కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఎల్లప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి తరఫున పోరాడడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని.. దానికి ఆయన ప్రజా క్షేత్రంలోనే ఉంటున్నారని పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు.