Asianet News TeluguAsianet News Telugu

‘అవతార్-‌2’10 నిముషాల సీన్స్ తొలగింపు.. కారణం చెప్పిన కామెరాన్

ఏకంగా సినిమాలో 10 నిమిషాల మేర సన్నివేశాలను ఆయన కత్తిరించేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు కామెరాన్ స్వయంగా వెల్లడించారు. 

James Cameron Cut Out 10 Minutes of Avatar 2 Gun Violence
Author
First Published Dec 31, 2022, 6:36 PM IST


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అవతార్‌ సినిమా సీక్వెల్‌ ‘అవతార్‌-ది వే ఆఫ్ వాటర్' థియేటర్స్‌లో దిగేసింది.   ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదల చేశారు. భారత్ లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నాలుగు వేలకు పైగా తెరలపై విడుడలైంది. కథ, కథనం విషయంలో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ వసూళ్లలో ఈ చిత్రం దూసుకెళ్తోంది ఇప్పటికే లక్షలాది మంది ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకొని పండోరా ప్రపంచానికి చూసేసారు.  వీకెండ్ కలెక్షన్స్ దుమ్ము లేపాయి.   కేవలం మూడు రోజుల్లోనే సుమారు రూ. 3600 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారత్ లోనూ ఈ చిత్రంపై కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మూడు రోజుల్లోనే మరో హాలీవుడ్ చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్’ మొత్తం కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో పది నిముషాల సీన్స్ కట్ చేసారు కామెరాన్. అందుకు కారణం చెప్పారు ఆయన. 


సినిమా నిడివి తగ్గింపుపై కామెరాన్ మాట్లాడుతూ.. ‘‘నిజానికి 10 నిమిషాల పాటు తుపాకుల కాల్పులతో కూడిన యాక్షన్ సన్నివేశాలను కత్తిరించాను. వెలుగు, చీకటి మధ్య బ్యాలన్స్ లో భాగంగా అసహ్యంగా అనిపిస్తున్న వాటిని తొలగించాలని అనిపించింది. మీలో మీరు సంఘర్షణ పడాలి. మీరు ఎలా చూస్తున్నారనే దాని ఆధారంగా హింస, యాక్షన్ ఒకే విధంగా ఉంటాయి. యాక్షన్ సినిమా రూపొందించే ప్రతీ కళాకారుడికి దీనిపైనే డైలమా ఉంటుంది. కానీ, నేను యాక్షన్ చిత్రాలు తీసే వాడిగానే అందరికీ తెలుసు’’ అంటూ దృశ్యాల తొలగింపు వెనుక మానసిక సంఘర్షణను కామెరాన్ వివరించారు.


అవతార్ -2 సినిమా విడుదలైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డు నమోదు చేయడం తెలిసిందే. అయితే, కనీసం రెండు బిలియన్ డాలర్లు వసూలైతేనే లాభాలు చూడగలమని కామెరాన్ పేర్కొనడం గమనార్హం.
  
  ఈ సినిమా మొదటి భాగం పదమూడేళ్ల క్రితం వచ్చినప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలిజీ అప్పుడు లేదు. అప్పుడు కథ కూడా ఆ సినిమాకు అవసరమైంది. అయితే ఈ సారి కేవలం టెక్నాలిజీని ఆవిష్కరిస్తూ చిన్న స్టోరీ లైన్ తీసుకుని మన ముందుకు వచ్చాడు.  దాంతో  ఈ సినిమాలో స్క్రిప్టు, స్క్రీన్ ప్లే అంటూ చూస్తే ఏమీ ఉండదు. ఫార్ములా రివేంజ్ స్టోరీ కనిపిస్తుంది. అయితే విజువల్స్ మన కళ్లు నమ్మలేని స్దాయిలతో ఉంటాయి. అవతార్ ని మించిపోతాయి. టైటానిక్, ఏలియన్స్, ది అబీస్, ది టెర్మనేటర్ నాటి థీమ్స్, విజువల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కనపడతాయి. అవతార్ పార్ట్ 1 లో ఆధునిక మానవుల ఆత్యాశతో.. ఎక్కడో భూమికి దూరంగా ఉన్న పండోరా గ్రహంలోని  ఓ ఆదివాశి లాంటి తెగ, వారి అడవి నివాసాలు మొత్తం ప్రమాదంలో పడతాయి.

 అదే రెండవ పార్ట్ లో ... హీరో జేక్, నేత్రి , వారి సంప్రదాయ కుటుంబం, పిల్లలు, పండోరాను ఆక్రమించుకోవడమే ధ్యేయంగా ఉండి మరోసారి పండోరా గ్రహంపై దాడులు చేసే  మైల్స్ క్వారిచ్ చుట్టూ తిరుగుతుంది.  VFX, CGI,3D టెక్నాలిజీలోని అడ్వాన్స్ వెర్షన్స్  తో ఈ సినిమా రూపొందించారు. ఈ  సినిమా లో పాత్రలను ఎంతలా మనకు క్లోజ్ గా అనిపించేలా డిజైనమ్ చేసారంటే ...వాళ్లతో కలిసి ప్రయాణం చేస్తాం..ఎక్కడా వారి చేయిని విడిచిపెట్టం. ఆ పాత్రల కళ్లతోనే మనం సినిమా చూస్తాం.   ఈ కథ మన కల్చరల్ ఐడెండిటీని,  ప్రకృతిపై ప్రేమను   ఏ స్దాయిలో ప్రేరేపిస్తుంది...ప్రతిబింబిస్తుంది..అన్న దాన్ని ఎక్సప్లోర్ చేస్తూ సాగుతుంది. ఇది స్క్రిప్టుపరంగా, దర్శకత్వ పరంగా కామెరూన్ సాధించిన విజయం.

అవతార్‌ మొదటి భాగంలో పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్‌ కామెరూన్‌.. రెండో భాగంలో సముద్ర గర్భంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా చిత్రటీమ్  నిర్వహించిన ప్రమోషనల్‌ టూర్‌లో నిర్మాత జోన్‌ లాండౌ(Jon Landau) మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘‘అవతార్‌ ఐదో భాగం(Avatar 5) 2028లో వచ్చే అవకాశం ఉంది. అందులో సినిమాలోని పాత్రలన్నీ ఒక మంచిపని కోసం భూమి పైకి వస్తాయి’’ అని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios