Asianet News TeluguAsianet News Telugu

అనిరుధ్ కు జైలర్ ప్రొడ్యసర్ సర్ ప్రైజ్, లాభాలు పంచేస్తోన్న కళానిధి మారన్..

మొన్న రజనీకాంత్ కు.. నిన్న  దర్శకుడు నెల్సన్ దిలీప్ కు..  నేడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు.. వరుసగా సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాడు తమిళ స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్. సినిమా సక్సెస్ లో వాటాలు పంచేస్తున్నారు. 
 

Jailer Producer kalanithi Maran Gifts Brand New Porsche Suv car Anirudh Ravichander JMS
Author
First Published Sep 7, 2023, 11:42 AM IST

తమిళ తలైవార్ ... సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ (Rajinikanth) నటించిన పాన్‌ ఇండియా  మూవీ జైలర్‌ (Jailer).  నెల్సన్‌ దిలీప్  కుమార్‌ (Nelson Dilipkumar) డైరెక్ట్ చేయగా.. కళానిధి మారన్‌ (kalanithi Maran) నిర్మించిన ఈసినిమా  రీసెంట్ గా రిలీజ్ అయ్యి.. సౌత్ బాక్సాపీస్ ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల  ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఓటీటీలో రిలీజ్ అయిన జైలర్ ఇప్పటికీ థియేటర్ లో కూడా  దూసుకెళ్తూనే ఉంది.  కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తున్న ఈసినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 650 కోట్లకు పైగా  కలెక్షన్లు రాబట్టింది. 

ఇక రజనీపని అయిపోయింది.. ఆయన మార్కెట్ పడిపోయింది అని ప్రచారం చేసిన వారి నోర్లు మూయిస్తూ.. జైలర్ సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు టీమ్. అంతే కాదు మూవీ టీమ్ గ్రాండ్ గా పార్టీ కూడా చేసుకున్నారు. ఇక అందరికంటే ఈసినిమా నిర్మాత కళానిధి మారన్.. జైలర్ సక్సెస్ పై ఫుల్ ఖుషిగా ఉన్నారు.  అందుకే జైలర్ సక్సెస్ కు కారణమైన వారికి.. ఈసినిమా లాభాలు పంచుతున్నారు. అంతే కాదు. జైలర్ టీమ్  కు వరాలు ప్రకటించారు.. స్టార్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ను ప్లాన్ చేశారు. 

ముందుగా రజనీకాంత్ కు, ఆతరువాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కు బహుమతులతో పాటు.. లాభాల్లో వాటా కూడా అందించారు కళానిధి మారన్.. ఇప్పుడు బహుమతిని అందుకునే వంతు జైలర్ మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్‌ రవిచంద్రన్‌కు దక్కింది. తన ముందుంచిన మూడు కార్లలో అనిరుధ్‌ పోర్షే మకాన్‌ కారును బహుమతిగా స్వీకరించారు. ఈ ఎస్‌యూవీ విలువ కోటి పదిలక్షలు. ఈ కారుతో పాటు చెక్‌ రూపంలో భారీ నగదును కూడా బహుమతిగా అందుకున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

 

సినిమా సక్సెస్‎తో పాటు లాభాలు కూడా భారీగా రావడంతో అందులో నుంచి కొంత భాగాన్ని హీరో రజినీ కాంత్‌, దర్శకుడు నెల్సన్‌కు వాటాగా ఇచ్చారు. రజినీకాంత్‌ను కలిసిన కళానిధి దాదాపు 1.24 కోట్ల విలువచేసే BMW X7 సిరీస్ కారును బహుమతిగా అందించిన విషయం తెలిసిందే. దాంతో పాటు ప్రాఫిట్స్‌లో కొంత మొత్తాన్ని చెక్కు రూపంలో అందించారు.  రజనీకాంత్ కు ఆయన 100 కోట్లు ఇచ్చినట్టు ప్రచారంజరిగింది. 

ఇక ఆతరువాత దర్శకుడు నెల్సన్‌ దిలీప్ కుమార్ కు కూడా  కళానిధి ఓ ఖరీదైన కారును గిఫ్ట్‌గా అందజేశారు. పోర్చే లేటెస్ట్‌ కారును కళానిథి  నెల్సన్ దిలీప్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ గా అందించారు. అంతే కాదు సినిమా లాభాల్లో కొంత మొత్తాన్ని చెక్కురూపంలో ఇచ్చారు. నెల్సన్‌కు కారును గిఫ్ట్‌గా అందిస్తున్న వీడియోను సన్‌ పిక్చర్స్‌ సంస్థ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. కాగా, జైలర్‌ విజయంతో తనకు గిఫ్ట్‌ ఇచ్చినందుకు కళానిధికి ధన్యవాదాలు తెలిపారు నెల్సన్‌. తన  సోషల్‌ మీడియా ద్వారా పేజ్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు తమిళ దర్శకుడు. 

Follow Us:
Download App:
  • android
  • ios