Asianet News TeluguAsianet News Telugu

పోరాడేందుకు లా ని ఆయుధంగా మలుచుకున్న సూర్య.. `జై భీమ్‌` ట్రైలర్‌

దౌర్జన్యం చేస్తున్న రాజకీయ నాయకులు, పోలీసులపై పోరాడుతున్నాడు సూర్య. అందుకు లాని ఆయుధంగా మలుచుకున్నాడు. కోర్ట్ లో పోరాడతానంటున్నాడు. అక్కడ సాధ్యం కాకపోతే రోడ్డు మీదకు వచ్చి పోరాడతానంటున్నాడు.

jai bheem trailer talk suriya mind blowing performance
Author
Hyderabad, First Published Oct 23, 2021, 7:48 AM IST

సూర్య(Suriya) పేద వారి కోసం పోరాటం కొనసాగిస్తున్నాడు. గిరిజనుల కోసం పోరాడుతున్నారు. ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్నాడు. వారికి న్యాయం జరిగేందుకు, వారిపై దౌర్జన్యం చేస్తున్న రాజకీయ నాయకులు, పోలీసులపై పోరాడుతున్నాడు. అందుకు లాని ఆయుధంగా మలుచుకున్నాడు. కోర్ట్ లో పోరాడతానంటున్నాడు. అక్కడ సాధ్యం కాకపోతే రోడ్డు మీదకు వచ్చి పోరాడతానంటున్నాడు. కానీ పోరాటం మాత్రం ఆపనని ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇస్తున్నాడు. 

ఇదంతా ఆయన నటిస్తున్న కొత్త సినిమా `జై భీమ్`(Jai Bheem)లోని సన్నివేశాలు. సూర్య ప్రస్తుతం టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో `జై భీమ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సూర్య లాయర్‌గా నటిస్తున్నారు. Jai Bheem Trailer శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. తెలుగు, తమిళం, హిందీలో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మూడు భాషల్లోనూ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులో పేదల హక్కుల కోసం, పేదల ఇళ్ల స్థలాల కోసం, వారి నివసించే స్థలాలపై పెద్దల కన్ను పడటం, వారినుంచి పేదలను రంక్షించడం కోసం పనిచేసే, వారి కోసం వాదించే ఓ లాయర్‌గా Suriya కనిపించనున్నారు. 

also read: HBD Prabhas: ప్రభాస్ జాతకం తిరగేస్తున్న జ్యోతిష్యులు.. ఎంజీఆర్, రజనీకాంత్ లాగే.. పెళ్లిపై అంచనా

ఇది 1997లో తమిళనాడులో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. లాయర్‌గా సూర్య అదరగొట్టారు. ఆయన నెక్ట్స్ లెవల్ నటనని ప్రదర్శించారు. ఇందులో ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్‌ 2న, అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాని రిలీజ్‌ చేయబోతున్నారు. తమిళనాట పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్‌ కాని నేపథ్యంలో ఓటీటీలో సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. సూర్య, జ్యోతిక కలిసి తమ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై `జై భీమ్‌` చిత్రాన్ని నిర్మించడం విశేషం. 

ఇదిలా ఉంటే సూర్య ఇటీవల `ఆకాశం నీ హద్దురా` చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు. తక్కువ ధరకే ఫ్లైట్‌ టికెట్‌ తీసుకొచ్చి, సామాన్యుడు కూడా విమానం ఎక్కేలా చేసిన ఎయిర్‌ దక్కన్‌ హెడ్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అనేక ప్రశంసలతోపాటు కమర్షియల్‌గానూ మంచి ఆదరణ పొందింది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios