ధఢఖ్ సినిమాతో బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా మాత్రం కమర్షియల్ గా బేబీకి పెద్దగా సక్సెస్ ఇవ్వేలేకపోయింది. దీంతో నెక్స్ట్ ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకోవాలని కష్టపడుతోంది. 

అలాగే డిఫరెంట్ కథలను కూడా ఎంచుకుంటోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. జాన్వీ మరోసారి సోషల్ మీడియాని తన గ్లామర్ తో షేక్ చేస్తోంది. చిట్టి డ్రెస్సుల్లో కుర్రకారు మతిపోయేలా అమ్మడు ఇచ్చిన దర్శనం మాములుగా లేదు. గతంలో చాలా సార్లు ఇలాంటి డ్రెస్సుల్లో కనిపించినప్పటికీ ఆమె అందం కొత్తగానే ఉందని నెటిజన్స్ కొంటెగా కామెంట్ చేస్తున్నారు.  

ప్రస్తుతం జాన్వీ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. కార్గిల్ గర్ల్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. అలాగే సంజయ్ భన్సాలీ కొత్త సినిమాలో నటించడానికి ఒప్పుకున్న జాన్వీ దోస్తానా 2లో కూడా నటిస్తోంది.