శ్రీదేవి మరణం దేశం మొత్తాన్ని విషాదంలోకి నెట్టివేసింది. ఇండియన్ సినీ పరిశ్రమలో లెజెండరీ నటిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి 54 ఏళ్ల వయసులోనే దుబాయ్‌ హోటల్ లో అత్యంత దయనీయ స్థితిలో మరణించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణానికి అసలు కారణం ఏమిటీ అనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. ఆమె మరణించిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది.తల్లి మరణంతో ఆమె కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషి కపూర్ తీవ్ర మనోవేదనలో కూరుకుపోయారు. ఇకపై తాము అమ్మ లేకుండానే జీవించాలనే విషయాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లిని ఎంత ప్రేమిస్తున్నానో తెలుపుతూ జాహ్నవి కపూర్ ఓ లేఖ రాశారు. ఆ లేఖను ఫెమినా మేగజైన్ ఎడిటర్ తాన్యా చైతన్యా తాజాగా బయట పెట్టారు. ఈ లేఖ చదివిని ప్రతి ఒక్కరూ ఉద్వేగానికి లోనవుతున్నారు.గతేడాది శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూతుళ్లకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఖుషి కపూర్ తండ్రి బోనీకి చాలా క్లోజ్ గా ఉంటుందని, జాహ్నవి తనతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటుందని తెలిపారు. ఇద్దరూ ఇండిపెండెంటుగా ఉంటారు, నేను లేకుండా అయితే జాహ్నవి అస్సలు ఉండలేదు అని.... వెల్లడించారు.శ్రీదేవి భౌతిక కాయానికి బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగనుంది. మంగళవారం రాత్రి దుబాయ్ నుండి శ్రీదేవి భౌతిక కాయం ముంబైలోని లోఖండ్ వాలా, గ్రీన్ ఏకర్స్ లోని ఆమె స్వగృహానికి చేరుకోవడంతో సినీ ప్రపంచం మొత్తం అక్కడికే చేరుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కి చెందిన పలువురు నటీనటులు ఆమెను కడసారి చూసేందుకు తరలివచ్చారు