కృష్ణపట్నం ఆనందయ్య,ఆయన తయారు చేసిన మందు గత కొద్ది రోజులు గా హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ మందు కోసం ప్రజలు భారీగా తరలి రావటంతో ఆపేసారు. దాంతో  తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల అటెన్ష‌న్ మొత్తం నెల్లూరు కృష్ణపట్నం వైపై ఉంది. ఆనందయ్య కరోనా మందు కరోనాపై పనిచేస్తుందా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాకపోయినా.. జనం మాత్రం ఆ ముందును బాగా నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ నటుడు జగపతిబాబు తాను ఆనందయ్య మందును ఎప్పుడో వాడానని, ఆయుర్వేదం హానీ చేయదని తాను బలంగా నమ్ముతానన్నారు. 
జగపతిబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య ఆయుర్వేద మందుని వాడిన వారిలో తాను ఒక‌డినని. తనకు క‌రోనా రాలేదని ఆయన స్ప‌ష్టం చేశారు. ‘‘ఎవరేమన్నా సరే.. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్‌ అయితే ఉండవు. కచ్చితంగా మంచే జరుగుతుందని నేను ఆనందయ్య మందుని వాడాను. అదృష్ట‌వ‌శాత్తు ఇప్ప‌టి వ‌ర‌కు నాకు కోవిడ్ రాలేదు. చాలా హ్యాపీగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. 

అలాగే ‘ఆయుర్వేదం మందులను పకృతి సహాజమైన ఔషధాలతో తయరు చేస్తారు. అలాంటి మందు ఎలాంటి హానీ చేయ‌దని నేను విశ్వ‌సిస్తున్నాను. నేచర్, భూదేవి తప్పు చేయదు. ఆనందయ్య మందు విషయంలో చాలామంది అభిప్రాయాలు చూశాను.. రకరకాల వీడియోలు చూసిన తరువాత ఓ అభిప్రాయానికి వచ్చాను’’ అన్నారు జగపతిబాబు. 

ఇక ఆనందయ్య ఆయుర్వేద మందుతో కృష్ణపట్నం చుట్టుపక్కల ప్రజలు కరోనా నుంచి కోలుకున్నారని చెప్తున్నారు. దానివల్ల  ఎలాంటి ఇబ్బందులు లేవని పలువురు చెబుతున్నారు. కేవలం వనమూలికలను... అందరికీ చెప్పే ఇస్తున్నారు ఆనందయ్య. ఎలాంటి దాపరికాలు లేకుండా తను ఉపయోగించే మందుల గురించి కూడా చెబుతున్నారాయన. 

  ఏపీలోని ప్రతి జిల్లాకు తొలి విడతగా కరోనా మహమ్మారి బారిన పడిన 5 వేల మందికి మందు పంపిణీ చేస్తానని తయారీ నిపుణుడు ఆనందయ్య చెప్పారు. ఆయనన కృష్ణపట్నం గ్రామంలోని శ్రీసిద్ధేశ్వరాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మహాశివుడి ముందు కరోనా మందు ఉంచి పూజలు చేయించారు. ఆనందయ్య మాట్లాడుతూ..సోమవారం (ఈ నెల 7న) 3 రకాల మందు ఉన్న కిట్‌ను ఆయా జిల్లా కేంద్రాలకు పంపిస్తామని చెప్పారు.