ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన జగపతిబాబు విలన్ పాత్రలతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆయన చేసిన సినిమాలు వరుస విజయాలు అందుకుంటున్నాయి. దీంతో ఆ తరహా పాత్రల్లో నటించడానికి జగపతిబాబు కూడా మక్కువ చూపిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు తన విలన్ పాత్రల్లో చూసిన ప్రేక్షకులు 'సాక్ష్యం' సినిమాలో చేస్తోన్న పాత్రలో గనుక అతడి చూస్తే కొడతారని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాడు. ఆ సినిమాలో అతడి పాత్ర అంత నీచంగా ఉంటుందట. ఇలాంటి పాత్రలు చేస్తుంటే తన మీద తనకే భయం వేస్తోందట. రొటీన్ లైఫ్ లో కూడా ఇలా మారిపోతానేమోనని అంటున్నారు. 

''లెజెండ్ సినిమాలో ఈగో ఉన్న విలన్ క్యారెక్టర్ చేశా.. నాన్నకు ప్రేమతో సినిమాలో క్లాస్ విలన్ రోల్ లో కనిపించాను. జయజానకి నాయకలో పరువు కోసం పరితపించే విలన్ గా చేశాను. ఇన్నాళ్లు నేను చేసిన విలన్ పాత్రలకు ఒక పర్పస్ ఉంది. కానీ 'సాక్ష్యం' సినిమాలో విలన్ రోల్ కూడా అలాంటిదేమీ ఉండదు. కేవలం డబ్బు కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడు. పరమ నీచుడు.

ప్రపంచంలో ఇలాంటి నీచుడు ఉండదు. ఇప్పటివరకు నేను విలన్ రోల్స్ చేసినా.. ఆడియన్స్ నన్ను క్షమించారు కానీ ఈసారి మాత్రం నన్ను కొట్టడం ఖాయం'' అని సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు. ఎన్ని రకాల విలన్ రోల్స్ చేస్తున్నా.. ఆ భగవంతుడి దయవలన ఆ ఛాయలు తనలో కనిపించవని చెప్పుకొచ్చాడు.