టాలీవుడ్ కి తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎలక్షన్స్ సంబంధాలు చాలా దగ్గరవుతున్నాయి. సినిమాలతో మాయ చేసి ఎలక్షన్స్ లో గెలవాలని కొందరు ప్లాన్ చేస్తుంటే, ఎలక్షన్స్ ను దృష్టిలో ఉంచుకొని సినిమాలతో కలెక్షన్స్ రాబట్టలని మరికొందరు ప్లాన్ చేస్తున్నారు. ఆ సంగతి పక్కనపెడితే ఎన్టీఆర్ బయోపిక్ కి రోజురోజుకి క్రేజ్ పెరుగుతోంది. 

కానీ వైఎస్సార్ బయోపిక్ యాత్రకు మాత్రం అనుకున్నంత స్థాయిలో క్రేజ్ రావడం లేదు. దీంతో జగన్ పాత్ర సినిమాలో ఉంచేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యాత్ర సినిమాలో మలయాళం స్టార్ హీరో మమ్ముంటి నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మొదట సినిమాలో జగన్ పాత్ర లేకుండా కంప్లీట్ చేయాలనీ అనుకున్నారు. 

కాని ఇప్పుడు జగన్ పాత్ర ఉంటేనే సినిమాకు క్రేజ్ వస్తుందని షూటింగ్ ఎండింగ్ దశలో దర్శకుడు మహి వి రాఘవ నిర్మాతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట్లో జగన్ క్యారెక్టర్ కోసం సూర్య - విజయ్ దేవరకొండ అంటూ అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే అవేమి వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఒక యువ హీరోను సంప్రదించినట్లు సమాచారం. ఇక డిసెంబర్ 21న సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పిన చిత్ర యూనిట్ ఏ విధంగా సినిమాను ప్రజెంట్ చేస్తుందో చూడాలి.