లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల తరువాత ఎంతవరకు విజయం సాధిస్తుందో గాని ఇప్పుడు సినిమాకు కొన్ని వర్గాల సపోర్ట్ గట్టిగానే దక్కుతోందని తెలుస్తోంది. మెయిన్ గా జగన్ అభిమానులు వర్మ సినిమాపై తెగ కామెంట్ చేస్తున్నారు. ట్రైలర్ అదిరిపోయింది అంటూ చెబుతుండడం చూస్తుంటే సినిమా ఓపెనింగ్స్ గట్టిగానే అందుకునేలా ఉందనిపిస్తోంది. 

ఆంద్రప్రదేశ్ లో సినిమా ఎంతవరకు రిలీజ్ అవుతుందో చెప్పడం కష్టమే. తెలంగాణలో అయితే సినిమా భారీగా రిలీజ్ అవ్వడం ఖాయమని టాక్ వస్తోంది. పొలిటికల్ పరంగా చూస్తే టీడిపికి వ్యతిరేక గాలి మొత్తం వర్మ సినిమావైపే మళ్లింది. అంటేఫ్యాన్ నుంచి వచ్చే గాలి మొత్తం ఇటే అంటూ కొన్ని మీమ్స్ కూడా వస్తున్నాయి. దీంతో వర్మ ప్రమోషన్స్ డోస్  గట్టిగానే పెంచేశాడు. 

సోషల్ మీడియాలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాకు సంబంధించిన ఎదో ఒక న్యూస్ తో హల్ చల్ చేస్తున్నాడు. జగన్ ట్రైలర్ చూస్తున్నట్లు ఒక ఫోటో కూడా క్రియేట్ చేశాడు. చంద్రబాబు పాత్రను టార్గెట్ చేస్తూ ట్రైలర్ లో వర్మ చూపించిన విధానం ఒక్కసారిగా ట్రైలర్ పై అంచనాలను పెంచేసింది. ఒక గంటలోనే  మిలియన్ వ్యూవ్స్ దాటేసిన ట్రైలర్ ఒక్కరోజులో కొత్త రికార్డ్ ఎదో సృష్టించేలా ఉందని టాక్.