అనూహ్యంగా `జగదేక వీరుడు అతిలోకసుందరి` సినిమా వార్తల్లో నిలుస్తుంది. దీనికి సంబంధించిన నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ సినిమాకి సంబంధించిన ఓ పబ్లిక్‌ నోటీస్‌ విడుదల చేసింది. 

మెగాస్టార్‌ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి నటించిన క్లాసిక్‌ మూవీ `జగదేక వీరుడు అతిలోకసుందరి`. ఈ చిత్రంతోనే శ్రీదేవికి `అతిలోక సుందరి` అనేట్యాగ్‌ యాడ్‌ అయ్యింది. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో లైఫ్‌ స్టోన్‌ మూవీలా నిలిచింది. బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ జోనర్‌ సినిమాల్లో దీన్ని కొట్టిందే లేదంటుంటారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు అద్భుత సృష్టికి, వైజయంతి మూవీస్‌పై అశ్వినీదత్‌ భారీ నిర్మాణ విలువలకు ఇది అద్దం పట్టే చిత్రంగా నిలుస్తుంది.

అనూహ్యంగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తుంది. దీనికి సంబంధించిన నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ సినిమాకి సంబంధించిన ఓ పబ్లిక్‌ నోటీస్‌ విడుదల చేసింది. ఇందులో తాము ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి హక్కులను ఎవరికీ అమ్మలేదని, సినిమాకి సంబంధించి సర్వ హక్కులు తమ వద్దే ఉన్నాయని పేర్కొంది. సినిమా కథ హక్కులు, సినిమాకి సంబంధించిన అన్ని ఇంటలెక్చ్వల్ ప్రాపర్టీ రైట్స్, మోరల్‌ రైట్స్, క్యారెక్టర్‌ రైట్స్ ఇలా ప్రతిదీ నిర్మాణ సంస్థ వద్దే ఉన్నాయని చెప్పింది. స్టోరీ, స్క్రిప్ట్, మ్యూజిక్‌, ఆర్క్, లా పరమైన హక్కులన్నీ తమ వద్దే ఉన్నాయని స్పష్టం చేసింది. 

దీంతోపాటు సినిమా రీమేక్‌, సీక్వెల్‌, ప్రీక్వెల్‌, వెబ్‌ సిరీస్‌, ఇలా సినిమాకి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా సర్వహక్కులు తమ సొంతమని వెల్లడించింది. ఎవరికీ తాము అమ్మలేదని, సినిమాకి నుంచి ఎలాంటి కంటెంట్‌ని వాడుకోవడానికి వీల్లేదని, ఒకవేళ అలాంటిది ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైజయంతి మూవీస్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు లీగల్‌ పరమైన, అలాగే ప్రొడక్షన్‌ పరమైన పబ్లిక్‌ నోటీస్‌ని ఇష్యూ చేసింది. చిరంజీవి, వశిష్ట మూవీ నేపథ్యం కూడా ఇలానే ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాణ సంస్థ ఈ నోటీస్‌ ఇవ్వడం హాట్‌ టాపిక్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Scroll to load tweet…

ఇక చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` సినిమా 1990 మే 9న విడుదలైంది. రెండు కోట్లతో రూపొంది, ఏకంగా 15కోట్లు వసూలు చేసిందని, అప్పట్లో ఇది సంచలన విజయం సాధించి నిర్మాతకి కాసుల వర్షం కురిపించింది. ఇందులో అమ్రీష్‌ పురి, రామిరెడ్డి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య, షాలిని, షామిలి ముఖ్య పాత్రలు పోషించారు.