జాక్వెలిన్ కారు యాక్సిడెంట్‌

జాక్వెలిన్ కారు యాక్సిడెంట్‌

బాలీవుడ్ బ్యూటీ జాక్విలైన్ ఫెర్నాండెజ్ వార్తల్లోకి వచ్చేసింది. ముంబైలో గతరాత్రి ఆమె ట్రావెల్ చేస్తున్న కారుని ఓ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాకపోతే కారు హెడ్ లైట్స్ డ్యామేజ్ అయ్యాయి. తనకు ఎలాంటి గాయాలు కాలేదని జాక్విలైన్ తెలిపింది. ప్రమాదం శనివారం ఉదయం జరిగినట్టు తెలుస్తోంది. ఆటో డ్రైవర్ తాగి డ్రైవ్ చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

రేస్ 3’ షూటింగ్ ఫినిష్ కావడంతో సల్మాన్‌.. యూనిట్ సభ్యులకు స్మాల్ పార్టీని తన అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి నటీనటులు కూడా హాజరయ్యారు. రాత్రి 10.30 గంటలకు మొదలైన పార్టీ తెల్లవార్లు సాగింది. ఆ పార్టీకి హీరోయిన్ జాక్విలైన్ కూడా హాజరైంది. పార్టీ తర్వాత సల్మాన్ అపార్ట్‌మెంట్ నుంచి తెల్లవారుజామున 2.20 గంటలకు ఇంటికి తన కారులో బయలుచేరింది. కార్టర్ రోడ్‌ వద్ద ఎదురుగా వస్తున్న ఓ ఆటో.. కారుని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos