బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ తన గారాల కుమారుడు అంటూ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వివరణ ఇచ్చాడు. దాదాపు సల్మాన్ తో పాటే జాకీ ష్రాఫ్ కెరీర్ ఒకేసారిమొదలైంది. అయితే చాలా కాలం తరువాత ఈ ఇద్దరు ఒక తెరపై ఎమోషనల్ బాండింగ్ తో దర్శనమివ్వనున్నారు. 

సల్మాన్ భరత్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో జాకీ ష్రాఫ్ సల్మాన్ కు తండ్రిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త నార్త్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే ఈ ఇద్దరి స్టార్ హీరోల వయసు కరెక్ట్ గా 10 ఏళ్ళు తేడా. సల్మాన్ కంటే జ్ష్రాఫ్ పెద్ద. దాదాపు ఇద్దరి కెరీర్ ఒకేసారి మొదలైంది. 

అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ష్రాఫ్ సల్మాన్ పై ఈ విధంగా వివరణ ఇచ్చారు. సల్మాన్ కి నేనంటే చాలా ఇష్టం.. మొదట్లో అతను నా జీన్స్ షూస్ కూడా వేసుకునేవాడు. అతను కూడా మేరా బచ్చా అంటూ ఆప్యాయంగా జాకీ మాట్లాడారు. జాకీ కుమారుడు టైగర్ ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి సక్సెస్ లతో తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు.