నెల రోజులుగా జాకీచాన్ కూతురు రోడ్లపైనే... హెల్ప్ చేయండి ప్లీజ్! (వీడియో)

First Published 2, May 2018, 11:13 AM IST
Jackie chans daughter Etta Ng Chok Lam and Andi Autumn Homeless
Highlights

నెల రోజులుగా జాకీచాన్ కూతురు రోడ్లపైనే

హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ కూతురు 19 ఏళ్ళ ఎట్టా ఇంగ్ తనకు హెల్ప్ చేయాలంటూ అందర్నీ అభ్యర్థిస్తోంది. తండ్రి అంత పెద్ద నటుడయినా ఈమె మాత్రం హాంకాంగ్ వీధుల్లో బ్రిడ్జీల కింద తలదాచుకుంటున్నదట!  ఇంగ్, ఆమె గర్ల్ ఫ్రెండ్ ఆండీ ఆటమ్.. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియోలో..తమ దయనీయ పరిస్థితి గురించి చెప్పుకున్నారు. ఇల్లు లేని తాము నెల రోజులుగా రోడ్లపైనే ఉంటున్నామని, తమకు ఎవరైనా సహాయం చేయాలని వారు ఈ వీడియోలో కోరారు. స్వలింగ సంపర్కులను వ్యతిరేకించే తమ తలిదండ్రులే తమ దుస్థితికి కారణమని వారు వాపోయారు. జాకీని తన తండ్రిగా తాను ఎప్పుడూ పరిగణించ లేదని, అసలు అతడు తన జీవితంలోనే లేడని ఎట్టా ఇంగ్ 2015 లోనే తెలిపింది. మాజీ బ్యూటీ క్వీన్ ఇలైన్ ఇంగ్ తో గతంలో జాకీ చాన్ ఎఫైర్ నడిపించగా..ఎట్టా ఇంగ్ పుట్టింది. అంతకు ముందే అతగాడు తన మొదటి భార్యతో సుమారు 35 సంవత్సరాలు కాపురం చేశాడు. ఎట్టా గురించి జాకీ ఎప్పుడూ నోరు విప్పకపోయినా, ఇలైన్ తో తను ప్రేమాయణం నడిపిన మాట నిజమేనని అంగీకరించాడు. కాగా..ఎట్టా లెస్బియన్ అనే ప్రచారం ఆ మధ్య సాగింది. బహుశా అందుకే జాకీ చాన్, ఇలైన్ ఆమెను దూరం పెట్టినట్టు తెలుస్తోంది. అటు-తాజాగా ఎట్టా పోస్ట్ చేసిన వీడియోపై స్పందించిన ఇలైన్.. తన కూతురు ఎట్టా వద్ద డబ్బులు లేకపోతే ఏదైనా పని చూసుకోవాలని, అంతేగానీ సహాయం చేయాలంటూ ఇలా వీడియో పోస్ట్ చేయడం ఏమిటని మండిపడింది. ఇంగ్, ఆండీ ఆటమ్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. 49 మిలియన్ డాలర్ల ఆస్తికి పడగలెత్తిన హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ కూతురి దురవస్థ చాలామందిని కదిలించినా.. ఇంకా మేమున్నామంటూ ఎవరూ ఆమెను ఆదుకునేందుకు ముందుకు రాలేదు.

                                      

loader