జబర్దస్త్ ఫైమా కూడా తన తల్లిదండ్రుల కోరిక నెరవేర్చేందుకు సిద్ధమైంది. పటాస్, జబర్దస్త్ షోల ద్వారా పాపులర్ అయిన ఫైమా..  ఆర్థికంగా బాగా స్థిరపడింది. మరి తన తల్లీ తండ్రుల కోసం ఏం చేసిందంటే..?  

జబర్థస్త్ ద్వారా ఫైమ ఫేమస్ అయ్యింది. తన మార్క్ పంచ్ లతో.. ప్రేక్షకులను నవ్వించడంతో.. చాలా తక్కువ టైమ్ లోనే ఆమె బాగా ఫేమస్ అయ్యింది. ఇక జబర్థస్త్ ను వీడియ బిగ్ బాస్ లో అడుగు పెట్టిన తరువాత ఇంకా పాపులర్ అయ్యింది ఫైమా. చివరి వారం వరకూ ఉండగలిగి మంచి ఫ్యాకేజ్ ను కూడా తెచ్చుకుంది ఫైమా. అయితే జబర్థస్త్ లో తన లక్ష్యం ఏంటో వివరంగా చెప్పిన ఈ కమెడియన్.. అది నేరవేర్చుకుంది. అది కూడా తన తల్లీ తండ్రుల కోసం చేసింది బ్యూటీ. 

బిగ్ బాస్ ద్వారా తనజీవితంలో లక్ష్యంగా పెట్టుకున్న రెండు కోరికల్ని వెల్లడించింది ఫైమా. తన తల్లీ తండ్రుల కోసం అవి చేయాలి అనుకుంది. తన ఎదుగుదలకు కారణమైన అమ్మ, నాన్నల కోసం ఏదైనా చేయాలని భావించిన ఫైమా.. సోంత ఇట్లో వారిని ఉంచి.. కారులో వారిని తిప్పాలని అనుకుంది. వారి కల నెరవేర్చే దిశగా అడుగులు వేసింది. ముందుగా తన తల్లి తండ్రుల కోసం సొంత ఇల్లు కొన్నానని ప్రకటించింది ఫైమా.. .. ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ లు జరుగుతున్నాయని వెల్లడించింది. 

ఇక రెండవ కల అయిన కారును రీసెంట్ గా తీర్చేసింది ఫైమా.. కారులో తిరగడంపేరెంట్స్ ని కారులో ఎక్కించుకుని పోతుంటే తన తల్లిదండ్రుల ముఖాల్లో బాధ గమనించానని ఆమె వెల్లడించింది. ఇక గతంలో స్కూటీ కొని తనపేరెట్స్ ను సంతోషపెట్టిన ఫైమా.. ప్రస్తుతం కారు కూడా కొని తల్లీ తండ్రుల ముఖంలో సంతోషం చూసింది. రీసెంట్ గా తన తల్లిని కార్ల షోరూంకి తీసుకెళ్లి నచ్చిన రంగు కారు కొనాలని అనుకుంది. కారు షోరూంలో కారుని చూపించింది. కారుకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది. అమ్మ, నేను రెండు కార్లు ఎంపిక చేశామని.. కారు అమ్మకి, నాన్నకి తీసుకుంటున్నా కాబట్టి నాన్నని కూడా అడిగి ఫైనల్ చేస్తామని వెల్లడించింది. అతి త్వరలోనే కారులో తిరగబోతున్నాం అని సంతోషాన్ని వెల్లడించింది. 

బిగ్ బాస్ తరువాత బయట పెద్దగా కనిపించడం లేదుఫైమా అవకాశాలు చేతికి వస్తున్నాయని.. కొన్నాళ్ళు తల్లీ తండ్రులతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్న ఫైమా.. త్వరలో వరుస ఫ్రోగ్రామ్స్ తో నవ్వించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక చూడాలి బిగ్ బాస్ ఇమేజ్ తో ఫైమా ఎలా దూసుకుపోతుందో చూడాలి.