'జబర్దస్త్' షోతో చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఒక్కొక్కరూ ఒక్కో ట్యాగ్ తో క్రేజ్ సంపాదించుకున్నారు. వీరిలో సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు. ఈ కామెడీ షోతో సుధీర్ కి ఎంతగా ఫాలోయింగ్ పెరిగిందో ప్రత్యేకంగా తెలిసిందే.. బుల్లితెరపై ఎన్నో షోలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.

ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాడు. అయితే ఒక్కోసారి మనకుండే ఫేమ్ ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతుంది. సుధీర్ విషయంలో కూడా అదే జరుగుతోందని టాక్. ప్రతీ షోలో సుధీర్ పై పంచ్ లు వేస్తుంటారు.

అది కూడా అమ్మాయిల పేర్లు పెట్టి సుధీర్ ని టార్గెట్ చేస్తుంటారు. ఒకరకంగా అతడికి బుల్లితెరపై ప్లేబాయ్ ఇమేజ్ ఏర్పడింది. తోటి యాంకర్లు, హోస్ట్ లు కూడా సుధీర్ తో కామెడీ చేయించడానికి అమ్మాయిల టాపిక్స్ తీసుకొస్తూ ఉంటారు. అయితే చాలా మంది ప్రేక్షకులు కూడా సుధీర్ ప్లేబాయ్ అనే అభిప్రాయానికి వచ్చేశారట.

ఈ క్రమంలో సుధీర్ ఏదైనా ఈవెంట్ కి హాజరైనా.. అతడిని కాస్త అనుమానంగా చూడడం వంటివి చేస్తున్నారట. ఇటీవల అటువంటి ఓ అనుభవం సుధీర్ బాగా హర్ట్ చేసిందట. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పుకొని బాధ పడినట్లు సమాచారం.