కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అందులో భాగంగా `జబర్దస్త్` ఫేమ్‌, కమెడీయన్‌ సుడిగాలి సుధీర్‌ ఇంట్లో విషాదం నెలకొంది. సుధీర్‌ వాళ్ల అమ్మమ్మ కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని రాంప్రసాద్‌ వెల్లడించారు. ఆదివారం ప్రసారమైన `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో రాంప్రసాద్‌ తెలిపారు. దీంతో సుధీర్‌ ఇంట్లో విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

అమ్మమ్మ చనిపోయినా సుధీర్‌ వెల్లలేకపోయాడని, చివరి చూపులు కూడా దక్కలేదని రాంప్రసాద్‌ తెలిపాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న సుధీర్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  కరోనా మహమ్మారి చాలా మంది సెలబ్రిటీలను బలితీసుకుంది. నటులు, దర్శకులు, రచయితలు, ఇలా అనేక మంది వైరస్‌ బారిన పడి కన్నుమూశారు. 

ఇక సుడిగాలి సుధీర్‌ `జబర్దస్త్` షోతో పాపులర్‌ అయ్యారు. ఈ షో తెచ్చిన గుర్తింపుతోనే హీరోగానూ నటించారు. `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌` చిత్రంలో హీరోగా నటించి మెప్పించారు. మంచి ప్రశంసలందుకున్నారు. అలాగే `త్రీమంకీస్‌` చిత్రంలోనూ నటించారు. త్వరలో మరో సినిమాలో హీరోగా నటించబోతున్నట్టు తెలుస్తుంది.