జబర్థస్త్ కామెడీ షో నుంచి వరుసగా వెండితెరపై సత్తా చాటుతున్నారు. హీరోలుగా, దర్శకులుగా మల్టీ టాలెంట్ చూపిస్తూ ఎదుగుతున్నారు. ఇక తాజాగా మరో జబర్థస్త్ కమెడియన్ మెగా ఫోన్ పట్టాడు.
జబర్థస్త్ ఖత్తర్నాక్ కామెడీ షో.. మల్టీ టాలెంట్ కు వేధిక అవుతోంది. ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ లు.. ఈ షో నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోగా సుడిగాలి సుధీర్ తన మార్క్ చూపించగా.. క్యారెక్టర్ ఆర్టిస్ గా గెటప్ సీను, హైపర్ ఆది, రంతస్థలం మహేష్, చమ్మకు చంద్రలాంటి వారు వరుసగా అవకాశాలు పొందుతున్నారు. హైపర్ ఆది అయితే స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా మంచి గుర్తింపు కూడా సాధించాడు. అటు గెటప్ సీను కూడా మంచి మంచి అవకాశాలు సాధిస్తున్నాడు.ఈక్రమంలో నటులుగానే కాకుండా జబర్థస్త్ ఆర్టిస్ట్ లు దర్శకులుగా కూడా వారి ప్రతిభ చాటుతున్నారు.
ఇక ఈ మధ్య దర్శకుడిగా మారిన జబర్థస్త్ కమెడియన్ వండర్స్ వేణు సాధించిన విజయం చర్చనీయాంశం అయ్యింది. బలగం సినిమాతో వేణు సూపర్ సక్సెస్ సాధించాడు. తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా నిలిచాడు. తాజాగా మరో సినిమాకు ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాడు వేణు. ఇక అంతకు ముందు కూడా జబర్థస్త్ నుంచి బయటకు వచ్చి.. కిర్రాక్ ఆర్పీ దర్శకుడిగా మారాడు. జేడీ చక్రవర్తితో సినిమా రూపొందించాడు ఆర్పీ. కాని ఈఆసినిమా ప్లాప్ అవ్వడంతో.. సినిమాలు వదిలి బిజినెస్ లోకి దిగాడు ఆర్పీ. ఇక తాజాగా మరో బజర్దస్త్ నటుడు దర్శకుడిగా మారాడు.
జబర్దస్త్‌లో తన కామెడీ టైమింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల పంచిన శాంతి కుమార్ ఇప్పుడు మెగాఫోన్ పట్టాడు. సాయికుమార్‌ను ప్రధాన పాత్రలో ‘నాతో నేను’ అనే ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే రిలీజైన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌తో పాటు పాటలకు సాహిత్యం కూడా అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతుండగా..త్వరలోనే మూవీని కంప్లీట్ చేసి... థియేటర్లలో వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్.
