సొంతింటి కల నెరవేరిందన్న జబర్దస్త్ శాంతి స్వరూప్... మొన్నే అమ్మేశాను అన్నాడు, అప్పుడే!
జబర్దస్త్ సీనియర్ కమెడియన్ శాంతి స్వరూప్ ఇటీవల ఇల్లు అమ్మేశాను అన్నాడు. అయితే స్నేహితులు, సన్నిహితుల సహాయంతో సొంతింటి కల నెరవేర్చుకున్నట్లు మరో వీడియో పెట్టాడు.

జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. కేవలం లేడీ గెటప్స్ తో అతడు ఫేమస్ అయ్యాడు. బక్క చిక్కిన శరీరంతో చూడగానే నవ్వొచ్చే రూపు శాంతి స్వరూప్ సొంతం. హైపర్ ఆది టీమ్ లో స్కిట్స్ చేసి బాగా పాప్యులర్ అయ్యాడు. హైపర్ ఆది రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ లపై రాసే పంచులు, సెటైర్స్ బాగా పేలుతాయ్. హైపర్ ఆది సక్సెస్ లో శాంతి స్వరూప్ పాత్ర కూడా ఉంది. చాలా కాలంగా జబర్దస్త్ చేస్తున్నా శాంతి స్వరూప్ టీమ్ లీడర్ కాలేకపోయాడు.
ఇటీవల శాంతి స్వరూప్ ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. అమ్మకు సర్జరీ చేయించాల్సి ఉంది. చేతిలో డబ్బులు లేవు. అందుకే ఇల్లు అమ్మేస్తున్నాని ఫ్యాన్స్ కి తెలియజేశాడు. శాంతి స్వరూప్ ఫ్యాన్స్ ఒకింత బాధపడ్డారు. కష్టపడి కొనుక్కున్న ఇల్లు అమ్మేసుకుంటున్నాడని ఒకింత ఆవేదన చెందారు.
తాజా వీడియోలు శాంతి స్వరూప్ సొంతింటి కల నెరవేర్చుకున్నట్లు తెలియజేశారు. మనకంటూ ఓ ఇల్లు ఉండాలని అందరూ అనుకుంటారు. అమ్మ ఆపరేషన్ కోసం ఉన్న ఇల్లు అమ్మేశాను. చాలా కాలం అద్దె ఇంట్లో ఉంటున్నాను. అయినవారు, సన్నిహితుల సహాయంతో సొంతింటి కల నెరవేర్చుకుంటున్నాను. కూకట్ పల్లి వద్ద గల భూదేవి హిల్స్ లో నా ఇంటి నిర్మాణం జరుగుతుంది. త్వరలో పూర్తి అవుతుందని తెలియజేశాడు. దీంతో శాంతి స్వరూప్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మధ్య నిజానిజాలతో సంబంధం లేకుండా యూట్యూబ్ వ్యూస్ కోసం జబర్దస్త్ కమెడియన్స్ ఫేక్ వీడియోలు పెడుతున్నారు. దీనిపై వారి అభిమానులు మండిపడుతున్నారు.