Asianet News TeluguAsianet News Telugu

రెస్టరెంట్ ఓపెన్ చేసిన జబర్థస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్, ఆర్పీ హోటల్ లో స్పెషల్ ఏంటంటే..?


రెస్టారెంట్ బిజినెస్ లోకి దిగాడు జబర్థస్త్  స్టార్ కామెడియన్ రామ్ ప్రసాద్. సడెన్ గా రెస్టారెంట్ స్టార్ట్ చేసిన.. ఆర్పీ .. అంతకు ముందే జబర్థస్త్ నుంచి వెళ్లిపోయి సంచలనం సృష్టించాడు. ఇంతకీ ఆర్పీ రెస్టారెంట్ స్పెషల్ ఏంటీ అంటే.. ? 

Jabardasth Comedian RP Restaurant Business
Author
First Published Dec 11, 2022, 4:04 PM IST

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ముందు నుంచి ఉన్నాడు రామ్ ప్రసాద్. నాగబాబు జబర్థస్త్ ను వీడిన తరువాత ఆర్పీ కూడా వెళ్లిపోయాడు.  జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పిన తర్వాత  డైరెక్టర్ గా మారి సినిమా కూడా చేశాడు రామ్ ప్రసాద్. కాని ఈ సినిమా అసలు ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. అయితే కొన్నాళ్లు..కొన్ని షోస్ చేసిన ఆర్పీ.. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు. ఈక్రమంలో జబర్థస్తు పై స్ట్రాంగ్ ఆరోపణలు కూడా చేశాడు ఆర్పీ. 

రీసెంట్ గా ఈ షో గురించి సంచలన ఆరోపణలు చేయడం  ద్వారా వార్తల్లో నిలిచాడు రామ్ ప్రసాద్. జబర్థస్త్ లో జరిగే అక్రమాలు ఇవీ అంటూ. ప్రతీ ఒక్కరిని టార్గెట్ చేస్తూ పలు ఇంటర్వ్యూలలో మాట్లాడాడు. ఇక తాజాగా  ఆర్పీ రెస్టారెంట్ బిజినెస్ లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. కూకట్ పల్లి లోని మంజీరా వాటర్ ట్యాంక్ ఎదురుగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఈ రెస్టారెంట్  ఓపెన్ చేశాడు రామ్ ప్రసాద్. 

అంతే కాదు ఈ రెస్టారెట్ ను వైజాగ్ సత్యానంద్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ఒపెనింగ్ చేయించాడు. దానికి సబంధించి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు జబర్థస్త్ ద్వారా తనకు ఫ్యాన్స్ అయిన వారు..  ఈ బిజినెస్ లో ఆర్పీ సక్సెస్ అవ్వాలని  కోరుకుంటున్నారు. అంతే కాదు తన రెస్టారెంట్ కు సబంధించిన విశేషాలు కూడా  పంచుకున్నాడు ఆర్పీ. ఈ రెస్టారెంట్ లో అన్నీ వంటలు కట్టెల పొయ్యిపై మాత్రమే వండుతామని ఆర్పీ వెల్లడించారు. తాను పదేళ్ల క్రితమే రెస్టారెంట్ ను ఏర్పాటు చేయాలని అనుకున్నానని ఇప్పటికి నా కల నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. 

ఆర్పీతో పాటు సత్తెన్న ఈ రెస్టారెంట్ లో భాగస్వామిగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆర్పీ స్వయంగా వెల్లడించాడు. రామ్ ప్రసాద్ నెల్లురు అని తెలిసిందే. తన స్కిట్స్ లో కూడా నెల్లూరు విషయాలు తీసుకువస్తుండేవాడు. ఇక నెల్లురు బ్రాండ్ ను చూపించేలా.. నెల్లూరు చేపల పులుసు ను హైదరాబాద్ వారికి టేస్ట్ చూపించబోతున్నాడు ఆర్పీ.  నెల్లూరు చేపల పులుసు అంటే తనకు ఎంతో ఇష్టమని ఆర్పీ వెల్లడించారు. 

 ఆర్పీకి గతంతో పోల్చి చూస్తే సినిమా, టీవీ ఆఫర్లు తగ్గాయి. ఆర్పీ ప్రవర్తన వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కొంతమంది నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆర్పీ తన కలలను నెరవేర్చుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జబర్దస్త్, ఇతర షోల ద్వారా సంపాదించిన డబ్బును ఆర్పీ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేశారని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios