Asianet News TeluguAsianet News Telugu

సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న కిర్రాక్ ఆర్పీ, వైరల్ అవుతున్న జబర్ధస్త్ కమెడియన్ పెళ్ళి పోటోలు

హడావిడి లేకుండా.. చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకున్నాడు జబర్థస్త్ మాజీ కమెడియన్  కిర్రాక్ ఆర్పీ. బిజినెస్ లో ఫుల్ సక్సెస్ అయిన ఆర్పీ.. తాజాగా తాను ప్రేమించిన లక్ష్మీ ప్రసన్న మెడలో మూడుముళ్ళు వేశాడు. 
 

Jabardasth Comedian Kiraak Rp Wedding Photos Viral In Social Media JMS
Author
First Published Nov 29, 2023, 9:52 PM IST


ఎప్పుడో ఏడాది క్రితం ఏంగేజ్మెంట్ చేసుకున్నాడు జబర్ధస్త్ మాజీ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. నిశ్చితార్ధం చేసుకున్న ఏడాది తరువాత ఆయన పెళ్ళి పీటలు ఎక్కాడు. తాను ప్రేమించిన లక్ష్మీ ప్రసన్నతో  కిరాక్ ఆర్పీ పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఈరోజు(నవంబర్ 29) అనగా బుధవారం నాడు వైజాగ్‌లో ఇరువురు  కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకలకుసబంధించి పెద్దగా హడావిడి లేకుండా సాగిసోయింది. 

ఇక కిర్రాక్ ఆర్పీ పెళ్లికి... పలువురు సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఇక  బీచ్ కి అతి దగ్గరగా  ప్రకృతి అందాల నడుమ తమ పెళ్ళి  ప్లాన్ చేసి చేసుకున్నట్టు  కిరాక్ ఆర్పీ తెలిపాడు. చాలా కాలంగా వీరు ప్రేమలో ఉన్నరు. అయితే ఆర్పీ ని పెళ్లాడిన లక్ష్మీ ప్రసన్న సివిల్స్ కోచింగ్ కోసం ఆర్‌సీ రెడ్డి కోచింగ్‌ సెంటర్‌ లో జాయిన్ అవ్వగా.. ఈ కోచింగ్ సెంటర్ లో జరిగిన ఓ వేడుకలకు గెస్ట్ గా వచ్చిన ఆర్పీని చూసి ప్రేమించింది లక్ష్మీ ప్రసన్న. 

Jabardasth Comedian Kiraak Rp Wedding Photos Viral In Social Media JMS

ఆర్పీ చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డ ఆమె.. ఆతరువాత అతనికి విషయం వివరించింది. మొత్తానికి వీరు ప్రేమని వ్యక్త పరుచుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక జబర్దస్త్ కమెడియన్ గా స్టార్ డమ్ సంపాదించాడు ఆర్పి. కిర్రాక్ ఆర్పీగా పేరు తెచ్చుకుని.. టీమ్ లీడర్ గా కూడా మంచి మంచి స్కిట్ లు చేశాడు. ఆయన ఏం స్కిట్ చేసినా.. నెల్లురు యస.. నెల్లురు పదం, వెంకటేశ్వరావు.. ఈ మూడు ఉండేట్టు చూసుకునేవాడు. జబర్థస్తు నుంచి బయటకు వచ్చి.. ఆ షోపై.. నిర్వాహకులపై ఘాటు విమర్షలు చేశాడు ఆర్పీ.. 
 
కామెడీ షో నుంచి బయటకు వచ్చి..వెండితెరపై వెలగాలి అనుకున్నాడు కీరాక్ ఆర్పీ. దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుని..దెబ్బతిన్నాడు. ఇక లాభం లేదు అని.. బిజినెస్ వైపు వచ్చాడు ఆర్పీ. బయటకు వచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్లు స్టార్ట్ చేశాడు.  బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి.. దూసుకుపోతున్నాడు ఆర్పీ. ఈ విషయంలో మంచి సక్సెస్ ను వెనకేసుకుకోవడంతో పాటు మంచి లాభాలు కూడా వెనకేసుకుంటున్నాడు ఆర్పీ. 

ఇక ఆర్పీ  ఒక్క బ్రాంచ్ తో ఆపకుండా.. ఈ చేపల పులుసు పేరు మీద.. ఫ్రాంచైజీస్ కూడా స్టార్ట్ చేసాడు ఆర్పి. హైదరాబాద్ లోనే  కూకట్ పల్లి, మాదాపూర్, అమీర్ పేట ప్రాంతాల్లో ఆర్పీ చేపల పులుసు ఓన్ బ్రాంచెస్ ఉన్నాయి. అనంతపూర్, బెంగుళూర్, విశాఖ పట్టణాల్లొ ఫ్రాంచైజీస్ ఇచ్చిన ఆర్పీ.. భారీగా లాభాలు సాధిస్తున్నాడు. తాజాగా తిరుపతిలో మరో బ్రాంచ్ ను కూడా ఘనంగా స్టార్ట్ చేశాడు ఆర్పీ. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios