స్టార్ హీరోయిన్‌తో నెల్లూరు పెద్దారెడ్డి చేపలపులుసు కొత్త బ్రాంచ్.. జబర్దస్త్ నటుడు కిర్రాక్ ఆర్పీ దందా కేక
జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ ఆ మధ్య అనంతపురంలోనూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కొత్త బ్రాంచ్‌ని స్టార్ట్ చేశాడు. అది కూడా సక్సెస్ అయ్యింది. దీంతో వరుసగా కొత్త బ్రాంచ్‌లు విస్తరించే పనిలో పడ్డారు.

జబర్దస్త్ కమెడియన్‌గా పాపులర్ అయ్యాడు కిర్రాక్ ఆర్పీ(కిర్రాక్ రామ్ ప్రసాద్). తనదైన కామెడీతో మెప్పించారు. జబర్దస్త్ కమెడియన్లలో ప్రత్యేకంగా నిలిచారు. కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ మానేసి చాలా రోజులవుతుంది. ఆ మధ్య సినిమాల్లో ప్రయత్నాలు చేశాడు. దర్శకుడిగా మారాలనుకున్నాడు. ఓ సినిమాని కూడా ప్రారంభించారు. కానీ దాని అప్‌డేట్ లేదు. మధ్యలోనే ఆగిపోయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సొంత వ్యాపారాలపై ఫోకస్ పెట్టాడు.
చాలా రోజులుగా చేపల పులుసులో తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్‌ని నడిపిస్తున్నారు. `నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు` పేరుతో దాన్ని నిర్వహిస్తున్నారు కిర్రాక్ ఆర్పీ. మొదట ఆయన కూకట్‌పల్లిలో ప్రారంభించారు. జనం తాకిడి పెరగడంతో కొన్ని రోజులు ఆపేసి, మళ్లీ పెద్దగా స్టార్ట్ చేశాడు. అది సక్సెస్ కావడంతో మణికొండలో, అమీర్ పేటలోనూ కొత్త బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు.
దీంతోపాటు ఆ మధ్య అనంతపురంలోనూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కొత్త బ్రాంచ్‌ని స్టార్ట్ చేశాడు. అది కూడా సక్సెస్ అయ్యింది. దీంతో వరుసగా కొత్త బ్రాంచ్‌లు విస్తరించే పనిలో పడ్డారు. తాజాగా మరో జిల్లాలో ఈ బ్రాంచ్‌ని ఓపెన్ చేయబోతున్నారు. ఈ సారి తిరుపతి టార్గెట్ చేస్తున్నాడు. తిరుపతిలో `నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు`ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు కిర్రాక్ ఆర్పీ. అందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీలతో ఈ బ్రాంచ్‌లను ఓపెన్ చేయిస్తూ క్రేజ్ తీసుకొస్తున్నారు. తాజాగా తిరుపతిలో మెహరీన్‌తో లాంఛ్ చేయించేందుకు ప్లాన్ చేశారు. నవంబర్ 19న ఉదయం పదిగంటలకు ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.
జబర్దస్త్ వదిలేశాక కొన్నాళ్లు ఇబ్బంది పడ్డా కిర్రాక్ ఆర్పీ.. వ్యాపారాల్లోకి దిగి సక్సెస్ అవుతున్నారు. అందులో కర్రీపాయింట్ బాగా కలిసొస్తుంది. పైగా ఫేమస్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని పేరు పెట్టడంతో ఆ పేరే మరింతగా జనాల్లోకి వెళ్తుంది. సెలబ్రిటీలతో ఓపెనింగ్ అంటే అందరి అటెన్షన్ ఉంటుంది. దాన్ని వాడుకుని క్రమంగా ఎదుగుతున్నాడు ఆర్పీ. మున్ముందు చేపల పులుసు అంటూ కిర్రాక్ ఆర్పీనే గుర్తొచ్చినా ఆశ్చర్యం లేదు.