Roja Selvamani : ఏడాది తర్వాత ‘జబర్దస్త్’ ఆర్టిస్టులతో రోజా.. వాళ్లు మిస్ అయ్యారేంటీ?
మోస్ట్ సక్సెస్ ఫుల్ కామెడీ షో ‘జబర్దస్త్’కు సీనియర్ నటి రోజా కొన్నేళ్లు జడ్జీగా వ్యవహరించారు. ఇవాళ రోజాకు ప్రత్యేకమైన రోజుకావడంతో ఆర్టిస్టులంతా ఆమెను కలిశారు.
సీనియర్ నటి రోజా సెల్వమణి (Roja Selvamani) కి ఈరోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈవాళ ఆమె పుట్టిన రోజు కావడం విశేషం. నేటితో 51వ ఏటా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రోజాకు అభిమానులు, శ్రేయోభిలాషులు, సెలెబ్రెటీలు, పొలిటికల్ లీడర్లు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రోజా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించారు. స్టార్స్ సరసన నటించి మెప్పించారు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అభిమానులనూ దక్కించుకున్నారు.
పొలికల్ గా బిజీ అయిన సమయంలోనూ ఇటు బుల్లితెరపైనా సందడి చేశారు. ‘జబర్దస్త్’ (Jabardasth) కామెడీ షోకు జడ్జీగా వ్యవహరించి టీవీ ఆడియెన్స్ ను అలరించారు. తనదైన తీర్పులతో ఆకట్టుకున్నారు. షో సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ‘జబర్దస్త్’, ‘ఎక్ట్స్రా జబర్దస్త్’ షోలతో ఎంతో మంది ఆర్టిస్టులకూ భరోసాగా నిలిచారు. వారిని కుటుంబ సభ్యులనూ భావిస్తూ అన్ని విషయాల్లో అండగా నిలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు జబర్దస్త్ ఆర్టిస్టులు రోజా ఇంట్లో సందడి చేసిన విషయం తెలిసిందే.
ఈరోజు రోజా పుట్టిన రోజు కావడంతో జబర్దస్త్ ఆర్టిస్టులంతా ఆమెను ప్రత్యేకంగా కలిసి విషెస్ తెలిపారు. ఆమెతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా సందర్శించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అందరూ గ్రూప్ ఫొటోటో దిగారు. రోజా ‘జబర్దస్త్’ను వీడి ఏడాది సమయం అయ్యింది. ఇన్ని నెలల తర్వాత మళ్లీ ఇలా అందరితో కలిసి కనిపించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే, బుల్లితెర స్టార్స్ గా ఎదిగిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, హైపర్ ఆది మాత్రం హాజరు కాలేదు. సుడిగాలి టీమ్ రోజాకు ఎంత స్పెషలో తెలిసిందే. వారిపై ఎంతలా ఫన్నీ కామెంట్స్ చేసినా, వారూ జోక్స్ వేసినా సరదగా తీసుకొని ప్రేక్షకులను అలరించారు. ఈ గ్రూప్ ఫొటోలో వారూ ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఫొటోలో.. అదిరే అభి, గాలిపటాల సుధాకర్, అప్పరావు, ఇమ్మాన్యుయేల్, కెవ్వు కార్తీక్, తదితరులు ఉన్నారు.