నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జాతి రత్నాలు. ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా దర్శకుడు అనుదీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ స్వప్న సినిమా బ్యానర్ పై జాతి రత్నాలు నిర్మించడం విశేషం. నేడు శివరాత్రి కానుకగా జాతి రత్నాలు విడుదల కావడం జరిగింది. 


జాతి రత్నాలు మూవీకి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ నడుస్తుంది. ముఖ్యంగా యూత్ చిత్రంలోని కామెడీని బాగా ఎంజాయ్ చేసినట్లు చెవుతున్నారు. నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు చిత్రంతో మరో హిట్ కొట్టారన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ సంతోషం వ్యక్తం చేశారు. 


మీడియాతో మాట్లాడిన అనుదీప్... తన నెక్స్ట్ మూవీ గురించి తెలియజేశారు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ కామెడీ కథ రాసుకున్నట్లు ఆయన చెప్పారు. అదే తన తదుపరి చిత్రం అవుతుందని అన్నారు. ఇక ఆ చిత్ర హీరో ఎవరని అడుగగా.. తెలియదు.. జాతి రత్నాలు విజయంపై అది ఆధారపడి ఉంటుందని అనుదీప్ తెలియజేశారు. కడుపుబ్బా నవ్వించే చిత్రాలు రావడం పరిశ్రమలో తగ్గిపోయిన నేపథ్యంలో, కామెడీ చిత్రాలకు ఆదరణ పెరుగుతుంది.