Asianet News TeluguAsianet News Telugu

15ఏళ్ల తరువాత బాలీవుడ్ కి అపరిచితుడు!

అపరిచితుడు హిందీ రీమేక్ నందు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. ఇక వరిజినల్ వర్షన్ తెరకెక్కించిన శంకర్,హిందీ వర్షన్ కూడా తెరకెక్కించనున్నారు. ఇక పెన్ మూవీస్ పతాకంపై డాక్టర్ జయంతిలాల్ గడ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మించనున్నారు.

its official vikram anniyan hindi remake with ranvir singh ksr
Author
Hyderabad, First Published Apr 14, 2021, 12:57 PM IST

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఆణిముత్యాలలో అన్నియన్ ఒకటి. తెలుగులో అపరిచితుడగా 2005లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డ్స్ షేక్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ చిత్రం హీరో విక్రమ్ ఇమేజ్ రెట్టింపు చేసింది. ఈ మూవీ విడుదలై 15ఏళ్ళు అవుతుండగా హిందీలో రీమేక్ చేస్తున్నట్లు నేడు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 


అపరిచితుడు హిందీ రీమేక్ నందు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. ఇక వరిజినల్ వర్షన్ తెరకెక్కించిన శంకర్,హిందీ వర్షన్ కూడా తెరకెక్కించనున్నారు. ఇక పెన్ మూవీస్ పతాకంపై డాక్టర్ జయంతిలాల్ గడ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. ప్రకటనతోనే మూవీపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. అపరిచితుడు మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. 


ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే హీరోయిన్, ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి వుంది. మరోవైపు రామ్ చరణ్ తో శంకర్ ఓ మూవీ ప్రకటించారు. ఆ చిత్రం తరువాత రణ్వీర్ మూవీ సెట్స్ పైకి వెళుతుండగా లేక ముందుగా రణ్వీర్ మూవీ తెరకెక్కిస్తారో చూడాలి. 


ఇక శంకర్-కమల్ కాంబినేషన్ లో షూటింగ్ జరుపుకున్న భారతీయుడు 2 మూవీ విడుదల సందిగ్ధంలో పడింది. దర్శక నిర్మాతల మధ్య విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు ఆ మూవీపై ప్రతికూల ప్రభావం చూపాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios