మెగా 154లో రవితేజ నటిస్తున్నట్లు చాలా కాలంగా కథనాలు వెలువడుతున్నాయి. కాగా దీనిపై నేడు అధికారిక ప్రకటన వచ్చింది. సెట్స్ లోకి రవితేజకు వెల్కమ్ చెబుతూ ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది టీమ్...

ఆచార్య ఫలితం చిరంజీవిని బాగా ఇబ్బంది పెట్టింది. ఇక కెరీర్ లో ఎలాంటి జయాపజయాలు ఎన్నో చూసిన చిరంజీవి కమిటైన ప్రాజెక్ట్స్ పై దృష్టి సారించారు. ఏక కాలంలో మూడు చిత్రాలు పూర్తి చేస్తున్నారు. వాటిలో మెగా 154 ఒకటి. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ ప్రోమో పోస్టర్స్ అలరించాయి. 90ల నాటి మాస్ చిరును గుర్తు చేశాయి. ఆయన మాస్ లుక్ కేక పుట్టించింది. చిరంజీవి అప్ కమింగ్ చిత్రాల్లో మెగా 154(Mega 154)పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

కాగా కథ రీత్యా మూవీలో ఓ కీలక పాత్ర ఉంటుందట. అది స్టార్ హీరో చేస్తే బాగుంటుందని భావించిన దర్శకుడు బాబీ మాస్ మహారాజ్ రవితేజ(Raviteja)ను ఎంపిక చేశారు. మెగాస్టార్ మూవీ కావడంతో రవితేజ సైతం కాదనకుండా పచ్చ జెండా ఊపారు. దీనిపై చాలా కాలం క్రితమే వార్తలు వెలువడ్డాయి. ఆ మధ్య అనుకోని కారణాలతో రవితేజ తప్పుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఊహాగానాలకు తెరదించుతూ నేడు అధికారిక ప్రకటన చేశారు. హీరో రవితేజ నేడు మెగా 154 సెట్స్ లో జాయిన్ అయ్యారు. 

ఈ అప్డేట్(Mega 154 Update) పై ప్రత్యేక వీడియో విడుదల చేశారు. రవితేజను చిరంజీవి స్వయంగా క్యారవాన్ లోకి ఆహ్వానించారు. ఇక రవితేజ ఎంట్రీతో మెగా 154పై అంచనాలు భారీగా పెరిగాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తున్నారు. స్టార్ డమ్ రాక ముందు అన్నయ్య మూవీలో రవితేజ చిరంజీవి తమ్ముడు పాత్ర చేశాడు. తర్వాత కలిసి నటించడం ఇదే. ఈ మూవీలో చిరంజీవి జంటగా శృతి హాసన్ నటిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 

ఇక చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న గాడ్ ఫాదర్ విడుదలకు సిద్ధమవుతుండగా భోళా శంకర్ చిత్రీకరణ దశలో ఉంది. గాడ్ ఫాదర్ దసరా బరిలో దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల చిరంజీవి లుక్ విడుదల చేయగా విశేష స్పందన దక్కింది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చేస్తున్నారు. కీర్తి సురేష్, తమన్నా నటిస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.