వరస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది పూజ హెడ్గే.   ప్రస్తుతం ఈమె రాధేశ్యామ్, ‘ఆచార్య’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, ‘సర్కస్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆమె మరో ప్రాజెక్టు కమిటయ్యింది. గత కొంతకాలంగా తమిళ స్టార్ టు విజయ్‌ 65వ చిత్రంలోనూ పూజా భాగమైనట్లు కోలీవుడ్‌ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నిజమేనంటూ ఈ రోజు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమా చాలా భారీ ప్రాజెక్టు అని తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నారు. 

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఖ‌రారైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. పూజా హెగ్డేను త‌మ టీమ్‌లోకి ఆహ్వానిస్తున్న‌ట్లు త‌ల‌ప‌తి 65వ టీమ్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది. కాగా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుండ‌గా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ మూవీతో తొమ్మిదేళ్ల త‌రువాత త‌మిళ ఇండ‌స్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతుంది పూజా హెగ్డే.

Scroll to load tweet…

మోడ‌ల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన పూజా హెగ్డే, త‌మిళ్‌లో మూగ‌మూడి అనే మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. జీవా హీరోగా న‌టించిన ఈ చిత్రం 2012లో విడుద‌ల అయ్యింది. అయితే ఈ మూవీ అనుకున్నంత విజ‌యాన్ని సాధించ‌క‌పోగా.. పూజాకు వెంట‌నే ఆఫర్స్ రాలేదు. నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే ఇక్క‌డ మంచి గుర్తింపును తెచ్చుకోవ‌డంతో పాటు టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. మ‌ధ్య మ‌ధ్య‌లో హిందీ సినిమాల్లోనూ న‌టించిన పూజా.. ఇప్పుడు ఇటు తెలుగు, అటు హిందీలో బిజీగా మారింది.