ఎట్టకేలకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా... తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన చేశారు. బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ తో ఆయన చేయనున్న చిత్రంపై రేపు అప్డేట్ రానున్నట్లు తెలియజేశారు. టి సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. రన్బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి మూవీ చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే వార్తలు రావడం జరిగింది. కబీర్ సింగ్ నిర్మాతలు దీనిపై హింట్ కూడా ఇచ్చారు. కారణం ఏదైనా ఈ ప్రాజెక్ట్ పై మరలా న్యూస్ రాలేదు. 

తాజాగా రేపు ఈ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. 
అర్జున్ రెడ్డి మూవీ హిందీ రీమేక్ కబీర్ సింగ్ బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగా ఫేమ్ ని మరింత పెంచేసింది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన ఆ చిత్రం అక్కడ వసూళ్ల వర్షం కురిపించింది. రూ.  350కోట్లకు పైగా వసూళ్లతో 2019 సంవత్సరానికి గానూ బాలీవుడ్ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కబీర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ అందుకుకున్న నేపథ్యంలో సందీప్ రెడ్డికి అక్కడే అవకాశాలు రావడం జరిగింది.

 
ఇక రన్బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా చేయనుంది ఓ క్రైమ్ థ్రిల్లర్ అని ప్రచారం జరిగింది. మాఫియా నేపథ్యంలో సాగె ఓ క్రైమ్ స్టోరీని రన్బీర్ కపూర్ కోసం సందీప్ రెడ్డి సిద్ధంగా చేశారట. సందీప్ రెడ్డి మూడవ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఇక 2017లో సందీప్ రెడ్డి తెరకెక్కించిన అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. హీరో విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ ని చేసిన ఆ చిత్రం అనేక రికార్డ్స్ నమోదు చేసింది. ఆ సినిమాతో సందీప్ రెడ్డి నిర్మాతల దృష్టిలో పడ్డారు.