నిన్న ఎలిమినేషన్ ప్రక్రియ చూస్తే ఇంటి సభ్యులు మొత్తం మూకుమ్మడిగా అమ్మ రాజశేఖర్ టార్గెట్ చేశారు. ఎలిమినేషన్ ప్రక్రియలో చివరికి మిగిలిన మెహబూబ్, అమ్మ రాజశేఖర్ లను కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన నాగార్జున, ఇంటి సభ్యులను ఇద్దరిలో ఒకరికి సపోర్ట్ చేయాలని కోరారు.  కన్ఫెషన్ రూమ్ లో కూర్చొని ఉన్న అమ్మ రాజశేఖర్, మెహబూబ్ చూస్తుండగా...కేవలం ఆరియానా, అవినాష్ మాత్రమే మాస్టర్ కి ఓటేశారు. 

మిగిలిన అభిజిత్, అఖిల్, మోనాల్, సోహైల్, లాస్యలు తమ ఓట్లని మెహబూబ్ కి ఓటేశారు. రోజులుగా ఆరియానా, అవినాష్ మరియు రాజశేఖర్ మాస్టర్ ఒకటిగా ఉంటున్నారు. ఒకటిగా ఉంటున్నారండం కంటే వీరిని మిగతా ఇంటి సభ్యులు వేరు పెడుతున్నారు. వీరు సపరేట్ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. నేడు నామినేషన్ లో అవినాష్ ఇదే అనుమానం వ్యక్త పరిచాడు. హారిక తమ టీం లో ఉండి ఎదుటి టీం కోసం ఆడిందని, ఆ కారణంగానే నామినేట్ చేస్తున్నట్లు చెప్పారు. 

ఈ ముగ్గురు సభ్యులలో ఆరియానా, అవినాష్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ఎంటర్టైన్ చేస్తున్న అవినాష్, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ తన ప్రత్యేకత చాటుకుంటున్న ఆరియానా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. సమంత మరియు నాగార్జున సైతం ఆరియానాను పొగడం ఇంటి సభ్యులలో కొందరికి నచ్చడం లేదు. దీనితో మిగతా సభ్యులు వెరీ ముగ్గురిని టార్గెట్ చేస్తున్నట్లు ఉంది.