Asianet News TeluguAsianet News Telugu

తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌.. ప్రముఖల నివాసాలపై ఐటీ సోదాలు..

హీరోయిన్‌ తాప్సీ, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ వంటి వారిపై బుధవారం ఐటీ అధికారులో దాడులు నిర్వహించారు. అకస్మాత్తుగా చేస్తున్న ఈ సోదాలు బాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. దాదాపు 22చోట్లు వీరి నివాసాలు, ఆస్తులు కలిపి దాదాపు 22 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

it rides on taapsee anurag kashyap and others makers  arj
Author
Hyderabad, First Published Mar 3, 2021, 3:01 PM IST

హీరోయిన్‌ తాప్సీ, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ వంటి వారిపై బుధవారం ఐటీ అధికారులో దాడులు నిర్వహించారు. అకస్మాత్తుగా చేస్తున్న ఈ సోదాలు బాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. దాదాపు 22చోట్లు వీరి నివాసాలు, ఆస్తులు కలిపి దాదాపు 22 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాప్సీ, దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌తోపాటు బాలీవుడ్‌ మేకర్స్ వికాల్‌ భల్‌, మధు మంతేనా నివాసాలపై, అలాగే ఫాంటమ్‌ ఫిల్మ్స్ లపై పన్ను ఎగవేత కేసులో ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఫాంట్‌ ఫిల్మ్స్ కార్యాలయం సహా ముంబయి, పుణేలో దాదాపు 22 ప్రదేశాలలో ఈ శోధనలు జరుగుతున్నాయి. 

మరోవైపు శిభాషిష్ సర్కార్ (సీఈఓ రిలయన్స్ ఎంటర్‌‌టైన్‌మెంట్), అఫ్సర్ జైదీ (సీఈఓ ఎక్సైడ్), విజయ్‌ సుబ్రమణ్యం (సీఈఓ క్వాన్) ఆస్తులపై కూడా శోధనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  ఉద్యమిస్తున్న రైతులకు  కశ్యప్, వికాల్‌ భల్‌,  తాప్సీ  మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిపై కావాలనే కక్ష్య సాధింపు చర్యలు తీసుకుంటున్నారని బాలీవుడ్‌ వర్గాలు కామెంట్‌ చేస్తున్నాయి. 

 అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోట్వానే, మధు మంతేనా, వికాస్‌ భల్‌ సంయుక్తగా ఫాంటమ్ ఫిలింస్‌  నిర్మాణ సంస్థను స్థాపించారు.  హిందీ, తెలుగు, బంగ్లాతో సహా పలు భాషల్లో అనేక బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించారు.  అయితే వికాస్ బహ్ల్‌పైకంపెనీ ఉద్యోగి లైంగిక వేధింపుల ఫిర్యాదుల తర్వాత 2018 లో ఈ సంస్థని నిలిపివేశారు. అనురాగ్ కశ్యప్ తన కొత్త నిర్మాణ సంస్థ గుడ్ బాడ్ ఫిల్మ్స్‌  పై సినిమాలు తీస్తున్నారు. విక్రమాదిత్య, మధు మంతేనా కూడా తమ సొంత ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. మూడేళ్ల క్రితమే మూసేసి సంస్థపై సోదాలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయనాయకులు, కార్పొరేట్లు కోట్లకు కోట్లు ఎగవేస్తూ ప్రభుత్వానికి టోకరా పెడుతుంటే, అవన్నీ వదిలేని సినిమా వాళ్లపై, తమకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఇలాంటి అనూహ్య దాడులకు తెగబడటం సరికాదని విశ్లేషకులు అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios