Asianet News TeluguAsianet News Telugu

Prema Entha Madhuram: నీరజ్ కు చెమటలు పట్టించిన ఐటీ ఆఫీసర్స్.. స్వామీజీ మాటలు వినీ షాకైన అను?

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ అందరి హృదయాలను దోచుకుంటూ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

It rides in neeraj office in todays prema entha madhuram Serial episode gnr
Author
First Published Mar 18, 2023, 2:04 PM IST

 ఎపిసోడ్ ప్రారంభంలో మనం ఎంత ప్రిపేర్ గా ఉన్న ఐటీ ఆఫీసర్స్ దగ్గర ప్రాపర్ గా  అన్ని కన్వే చేయగలము లేదో అని  కంగారుగా ఉంది దాదా లేడని నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు అంటాడు నీరజ్. మనం ఎలాగోలా మేనేజ్ చేద్దాం అంటాడు జెండే. ఇంట్లో బోల్డంత గోల్డ్ కొనిపెట్టాను ఇదంతా ఎటు పోయి ఎటు వస్తుందో అంటూ కంగారుపడుతుంది మాన్సీ.

 మరోవైపు ఎందుకు ఎప్పుడు మాస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అని ఆర్యని అడుగుతుంది అంజలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాడు ఆర్య. మిస్టర్ పర్ఫెక్ట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే అంటుంది అంజలి. ఆఫీసులో కూడా ఐటి ఆఫీసర్స్ చెక్ చేస్తూ ఉంటారు. లోపలికి వచ్చి చూసిన అంజలి వాళ్ళు ఒక్కసారి షాక్ అవుతారు ఏంటి వాతావరం ఇలా ఉంది అంటుంది అంజలి.

పరిస్థితిని అర్థం చేసుకున్న ఆర్య ఐటీ రైట్స్ అంటాడు. అంజలి లోపలికి వెళ్లబోతుంటే ఎవరు అని అడుగుతాడు పోలీస్. అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండిని. నీరజ్ గారిని కలవాలి అంటుంది అంజలి. ఐటి రైట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఎవరిని అలవ్ చేయము అంటాడు పోలీస్. ఫ్యూచర్లో నా కంపెనీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా అని అడుగుతుంది అంజలి.

 కానీ అప్పటికే ఆర్య అక్కడ ఉండడు. ఐటీ ఆఫీసర్ నీరజ్ ని నిలదీస్తూ ఉంటాడు మూడు లాండ్స్ కి సంబంధించిన డీలింగ్ పేపర్స్ ప్రాపర్ గా లేవు, సిగ్నేచర్ కూడా మిస్ మ్యాచ్ అవుతున్నాయి  అంటాడు. రిజిస్ట్రేషన్ కూడా ప్రాపర్ గా లేదు అంటే ఎవరికో లంచం ఇచ్చి కబ్జా చేసిన స్థలాన్ని మీరు కొన్నారు అంతేనా అంటూ కంగారు పెడతాడు.

మీ ఇంట్లో కూడా బిల్లు లేని గోల్డ్ చాలా ఉంది వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి లేదంటే వీటన్నిటిని సీజ్ చేస్తాను అంటాడు ఆఫీసర్. ఇవన్నీ మా బావగారే డీల్ చేస్తారు మేము జస్ట్ మేనేజ్ చేస్తాము అంతే అంటుంది మాన్సీ. కానీ పవర్ ఆఫ్ అటార్ని నీరజ్ వర్ధన్ గారి పేరు మీద ఉంది. దానికి ఆయనే సమాధానం చెప్పాలి అంటాడు ఆఫీసర్. దానితో సమాధానం చెప్పలేక టెన్షన్ పడిపోతారు నీరజ్  దంపతులు.

మరోవైపు దేవుడి పేరు పెట్టుకొని నన్ను చూడ్డానికి వస్తున్నావు కదా అని తల్లిని అడుగుతుంది అను. అలాగే అనుకో అమ్మ నీ కష్టాలన్నీ తీరిపోవాలని దేవుడికి మొక్కుకున్నాను అందుకే వస్తున్నాను అంటుంది బుజ్జమ్మ. నేను కూడా బిడ్డ పుట్టే సమయానికి ఎలాంటి సమస్యలు ఉండకూడదని కోరుకుంటున్నాను. సార్ వచ్చే టైం అయింది వెళ్దాము అంటుంది అను.

సరే అంటూ ఇద్దరూ బయలుదేరి వచ్చేస్తూ ఉంటే ఆశ పడటం వరకే మీ వంతు నెరవేర్చడం శివయ్య వంతు  కారణజన్మురాలివి ఏ కారణం లేకుండానే కష్టాల్లో కోరుకుపోతున్నావు అంటూ ఒక గురువుగారు ఆమెకి చెప్తారు. స్వామి నా బిడ్డ ఇంకా ఎన్ని రోజులు కష్టాలు పడాలి అని అడుగుతుంది  బుజ్జమ్మ . పీడకల కన్నావు కదా అష్టమ గడియల్లో బిడ్డ పుట్టకూడదని నీ ఈ ఆరాటం.

 అదే జరిగితే నీ జీవితానికి అదే అష్టదిగ్బంధనం.అలా కాకూడదని ఆ భగవంతుని ప్రార్ధించు. అదే అంశ నీకు రక్షణ కవచం అవుతుంది  అంటారు స్వామి. రాజనందిని అంటూ కంగారుపడుతుంది  అను. కంగారు పడకు చీకటి వెనుక వెలుగు ఉంటుంది ఆ వెలుగు కోసం ఎదురుచూడు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు స్వామి. కంగారు పడకు నువ్వు ఆ స్వామిని నమ్ముకో అంటూ కూతురికి ధైర్యం చేస్తుంది బుజ్జమ్మ.

నా కూతురు కాపాడు అంటే దేవుడికి దండం పెట్టుకుంటుంది బుజ్జమ్మ. మీకు ఫైవ్ డేస్ టైం ఇస్తున్నాము ఈ లోపు మాకు ప్రాపర్ గా ఆన్సర్స్ కావాలి అంతవరకు ఆఫీస్ వర్క్ ఏమీ నడవడానికి వీల్లేదు అంటారు ఐటి ఆఫీసర్స్. ఇదంతా కిటికీ వెనకనుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆర్య. ఐదు రోజులు పని జరగకపోతే కంపెనీకి చాలా లాస్ మేము ఒప్పుకోము అంటుంది మాన్సీ.

మీకు ఆ ఛాయిస్  లేదు అంటాడు ఆఫీసర్. ఇంతలో ఆర్యని గమనించిన జెండే నాకు ఐదు నిమిషాలు టైం ఇవ్వండి. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వస్తాయి అని ఆఫీసర్స్ కి చెప్పి బయటకు వస్తాడు జెండే. అప్పుడే అంజలి ఆర్య దగ్గరికి వచ్చి ఇప్పుడు వెళ్ళిపోదాము తర్వాత వద్దాము అంటుంది అంతలోనే జెండే వచ్చి అంజలిని  పలకరిస్తాడు. సిచువేషన్ టఫ్ గా ఉన్నట్టుంది అంటుంది అంజలి.

 ఆర్య వర్ధన్  గారు లేకపోవడంతో కొన్ని ఫైల్స్ కి  కు సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఇవ్వటం కష్టమవుతుంది. ఎవరు హెల్ప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అంటాడు జెండే. ఆనంద్ మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అంటుంది, అందులో మా ఆనంద్ గారు ద బెస్ట్ అంటుంది అంజలి. ఆనంద్ గారు మాకు హెల్ప్ చేయగలరా అని అడుగుతాడు జెండే.  వెళ్లండి ఆనంద్ మనకి ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళు ప్రాబ్లం లో ఉన్నారు.

వాళ్ళ కంపెనీ బాగుంటేనే మన కంపెనీ బాగుంటుంది అంటూ ఆర్యని పంపిస్తుంది అంజలి. లోపలికి వచ్చిన ఆర్య ఆఫీసర్స్ అందరూ కన్విన్స్ అయ్యేలాగా ఆన్సర్స్ ఇస్తాడు. రిసార్ట్స్ కి సంబంధించిన డీలింగ్ అవతలి వైపు పార్టీ వాళ్ళు మోసం చేశారు అందుకు మేము కంప్లైంట్ కూడా చేసాము అంటాడు ఆర్య. ఎఫ్ఐఆర్ కాపీ గంటలో మీ ముందు ఉంచుతాను అంటాడు జెండే.

ఇంట్లో దొరికిన గోల్డ్ కి బిల్స్ కూడా టాక్స్లతో సహా టుడేస్ లో మీకు సబ్మిట్ చేస్తాను అంటాడు ఆర్య. కార్యవర్గం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టర్నోవర్ 19 క్రోర్స్. ప్రతి చిన్న విభాగానికి సంబంధించి టాక్స్లు సబ్మిట్ చేస్తాము వాటికి సంబంధించిన రికార్డ్స్ అన్ని  లాకర్ నెంబర్ 214లో ఉన్నాయి ప్రతి విభాగానికి సంబంధించి టోటల్గా 32 అకౌంటెంట్స్ ఉన్నారు కావాలంటే వాళ్ళ అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు.

అలాగే లాకర్ నెంబర్ ఫైవ్ నాట్ ఫోర్ లో గత పది సంవత్సరాల ఆదాయపు ఎకౌంట్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు అంటే ఫుల్ క్లారిఫికేషన్ ఇస్తాడు. అందరూ నోరెళ్లబెట్టి చూస్తారు. ఇది విలువలతో కూడిన వ్యాపార సామ్రాజ్యం. ఈ కంపెనీలో ఎక్కడా తప్పు జరగదు అంటాడు ఆర్య. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా అంటాడు ఆర్య. రాజనందిని టెక్స్టైల్స్ ఎండి అయినా అనురాధ గారి సంతకాలు కొన్ని ఫైల్స్ మీద సంతకాలు లేవు.

ఇవి ఆవిడ దృష్టి వరకు వెళ్లిందో లేదో మాకు క్లారిటీ కావాలి అందుకని క్లారిఫికేషన్ ఆవిడే ఇవ్వాలి  అంటాడు ఆఫీసర్. ఇప్పటికిప్పుడు కావాలి అంటే ఎలా తను ప్రెగ్నెంట్ అంటుంది మాన్సీ. మీ ఎక్సమినేషన్స్ మీకు ఉంటే మా రూల్స్ మాకు ఉంటాయి మేము వాటిని ఫాలో అవ్వాలి అంటారు వాళ్ళు. నేను తీసుకొస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ బయటికి వెళ్తాడు జెండే.

అను వచ్చి ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యే వరకు అంజలి కంట్లో పడకూడదు అని నీరజ్ కి చెప్తాడు ఆర్య. నేను మేనేజ్ చేస్తాను అంటాడు నీరజ్. ఆ విషయం నేను చూసుకుంటాను అంటూ మాన్సీ,అంజలి దగ్గరికి వెళ్తుంది. అంజలి కంగారుగా అంతా ఓకేనా అని అడుగుతుంది. అంతా ఓకే కొన్ని టైల్స్ ఇంకా చెక్ చేస్తున్నారు అంటుంది మాన్సీ. నాకు తెలుసు మా గురూజీ అడుగుపెడితే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవ్వాల్సిందే అంటుంది అంజలి.

మీ హెల్ప్ కి థాంక్స్ రండి చాంబర్లో కూర్చుందాం అంటూ అంజలిని అక్కడి నుంచి తీసుకెళ్ళి పోతుంది మాన్సీ. మరోవైపు జెండే అను దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. మరోవైపు అను అక్కడ ఏం రాజకీయం చేస్తుందో ఏంటో నేను అక్కడ ఉండడమే బెటర్ అనుకుంటూ ఐదు నిమిషాల్లో వస్తాను అని అంజలికి చెప్పి వెళ్తుంది మాన్సీ. జెండే అనుని తీసుకురావడంతో ఆమె దగ్గర తమ డౌట్లని అడుగుతారు ఆఫీసర్స్.

 మాన్సీ చేసిన అవకతవకలను గుర్తిస్తుంది కానీ ఆఫీసర్స్ ముందు  బయటపడకుండా జాగ్రత్తపడుతుంది. ఆఫీసర్స్ కి అవసరమైన క్లారిఫికేషన్ ఇస్తుంది. ఇక్కడ జరిగిన ప్రతిదీ నాకు తెలిసి, నా అనుమతితోనే జరిగింది అని చెప్తుంది అను. తరువాత ఏం జరిగిందో రేపు ఎపిసోడ్ లో చూద్దాం.

Follow Us:
Download App:
  • android
  • ios