పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మొత్తానికి రిలీజ్ కు సిద్ధమైంది. అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేసేందుకు పనులన్నీ ఫినిష్ చేశారు. రీసెంట్ గా సినిమా సెన్సార్ వర్క్ ని కూడా ఫినిష్ చేసుకుంది. అయితే ఈ కాంబినేషన్ కి  A సర్టిఫికెట్ రావడం విశేషం. 

ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే రామ్ - మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ చేసే పూరి ఎప్పుడు లేని విధంగా మాస్ మసాలా డోస్ ని ఎక్కువగా పెంచేశారు.  బిజినెస్ మెన్ సినిమా అనంతరం పూరి సినిమాలకు A సర్టిఫికెట్ రాలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు వచ్చింది. సెన్సార్ సభ్యులు కొన్ని కట్స్ తో Aసర్టిఫికెట్ ని జారీ చేసింది. డబుల్ దిమాక్ తో రామ్ చేసే హడావుడి సినిమాలో మాములుగా ఉండదట. దాదాపు తన శక్తిని మొత్తం ఇస్మార్ట్ శంకర్ కోసం ధారపోసినట్లు తెలుస్తోంది. 

అదే విధంగా క్రైమ్ - రొమాన్స్ అంశాలు కూడా సినిమాలో ఓ వర్గం ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ట్రైలర్స్ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసిన ఇస్మార్ట్ శంకర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి రిలీజ్ అనంతరం ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.