హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో ఇస్మార్ట్ శంకర్ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే వరంగల్, గుంటూరు నగరాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

హీరో రామ్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ నాటు లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్ గ్లామర్ లుక్స్ లో అదరగొడుతున్నారు. తాజాగా చిత్ర యూనిట్ రెండవ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో రామ్, హీరోయిన్ల మధ్య రొమాన్స్ ని ఎక్కువగా చూపించారు. 

పూరి మార్క్ తో ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.