రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త దారిలో పూరి తన సినిమాను డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ కూడా తన లుక్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. 

ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాలని ఓ వైపు పూరి మరో వైపు రామ్ చాలా కష్తపడ్డారు. ఫైనల్ గా సినిమాను జులై 12న రిలీజ్ చేయనున్నారు. అసలైతే మే చివరలోనే సినిమా రిలీజ్ కానుందని టాక్ వచ్చింది. పూరి గ్యాంగ్ కూడా సినిమాను అప్పుడే రిలీజ్ చేయాలనీ ప్లాన్ వేసుకున్నప్పటికీ కొన్ని షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో కొత్త రిలీజ్ డేట్ ను ఫైనల్ చేసింది. 

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ - నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా రిజల్ట్ పై దర్శకుడు పూరి చాలా నమ్మకంగా ఉన్నాడు. సినిమాలో యాక్షన్ సీన్స్ పూరి స్టైల్ కి తగ్గట్టుగా అభిమానుల అంచనాలను అందుకుంటాయని తెలుస్తోంది.