ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి టేకింగ్ కి రామ్ ఎనర్జీ యాడ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ట్రైలర్, టీజర్ లలో మాస్ మసాలా యాక్షన్ నింపేశారు. నిధి అగర్వాల్, నభా నటేష్ లు రామ్ తో జోడీకట్టారు. ఈ సినిమాకి 'A' సర్టిఫికేట్ రావడంతో మాస్ 
ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు. గురువారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది. సినిమాలో రామ్ అధ్బుతంగా డాన్స్ చేశాడని, తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ కనబరిచాడని చెబుతున్నారు. పూరి  రాసిన డైలాగ్స్ మాస్, యూత్ కి బాగా ఎక్కుతాయని.. తన మార్క్ డైలాగ్స్ తో పూరి అలరించాడని టాక్.

అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను చూడడానికి ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉందని.. ఆసక్తికర మలుపుతో ఇంటర్వ్యూ సీన్స్ ఉంటాయని చెబుతున్నారు. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా బాగా స్లో అయిందని.. రివెంజ్ ప్లాట్ ఊహించే విధంగా ఉండడంతో క్లైమాక్స్ కనెక్ట్ అవ్వదని అంటున్నారు.

సినిమాలో మూడు పాటలు బాగున్నాయట. ఇద్దరు హీరోయిన్లు తమ పాత్రలో ఓదిగిపోయారని, తెరపై అందంగా కనిపించారని తెలుస్తోంది. కమర్షియల్ గా చూసుకుంటే సినిమా  వర్కవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని అంటున్నారు. 

'ఇస్మార్ట్ శంకర్' ట్విట్టర్ టాక్!