పూరి జగన్నాధ్, రామ్ కలసి చేసిన మాస్ మంత్రజాలం బాగా పనిచేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అడ్డు లేకుండా దూసుకుపోతోంది. తొలిరోజు షాకిచ్చే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ చిత్రం రెండవరోజు కూడా బలమైన ప్రదర్శన కనబరిచింది. దీనితో ఇస్మార్ట్ శంకర్ చిత్రం సూపర్ హిట్ అని ట్రేడ్ విశ్లేషకులంతా డిసైడ్ అయిపోయారు. 

తొలి రోజు 7 కోట్ల షేర్ కొల్లగొట్టిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం రెండవరోజు 4 కోట్లకు పైగా షేర్ సాధించింది. మొత్తం రెండు రోజుల్లో ఈ చిత్ర షేర్ 12 కోట్లు దాటింది. ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 17 కోట్ల లోపే జరిగింది. దీనితో ఇప్పటికే కొన్ని ఏరియాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ చేరుకుంది. ఇక శనివారం నుంచి చాలా ఏరియాల్లో బయ్యర్లు లాభాలు పొందుతారు. 

ఇస్మార్ట్ శంకర్ జోరు చూస్తుంటే హీరో రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా ఈ చిత్రం నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలివారంలో ఈ చిత్రం 20 కోట్ల మార్క్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.