హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణా యాసతో బోల్డ్ డైలాగ్స్ తో ట్రైలర్ ని నింపేశారు. కొందరికి ఈ ట్రైలర్ నచ్చితే మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. 

ట్రైలర్ చాలా లౌడ్ గా ఉందని, తెలంగాణా నేపధ్యంలో, భాష, యాస కృత్రిమంగా ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. హీరో తలలో పోలీసులు ఒక చిప్ పెడతారు.. దాని చుట్టూ కథ తిరుగుతుంది. ఈ ట్రైలర్ చూసిన వాళ్లు ఇది పూరి ఆలోచన కాదని ఓ హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టారని అంటున్నారు.

మూడేళ్ల క్రితం హాలీవుడ్ లో రిలీజైన 'క్రిమినల్' సినిమా నుండి 'ఇస్మార్ట్ శంకర్' ప్లాట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 'క్రిమినల్' సినిమా ట్రైలర్ ని చూస్తే ఆ విషయం అర్ధమవుతోంది.

హాలీవుడ్ సినిమాలో పాయింట్ తీసుకొని దాన్ని తనదైన స్టైల్ లో స్క్రీన్ మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు పూరి. కొద్దిరోజుల్లో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.