ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కనిపించి సినిమాకె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచినా నాభా నటేష్ సోలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని చాలానే కష్టపడుతోంది. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో టాలీవుడ్ కి సింపుల్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే యాక్టింగ్ లో కిర్రాక్ అనిపించింది. 

అయితే ఆ సినిమా తరువాత లీడ్ రోల్ లో నటించే అవకాశం రాలేదు. ఇస్మార్ట్ శంకర్ హిట్టయినా క్రెడిట్ మొత్తం మరో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఎగరేసుకుపోయింది. ఇక నెక్స్ట్ డిస్కో రాజాలో అయినా లీడ్ రోల్ లో కనిపించనుంది అనుకుంటే ఆ సినిమాలో కూడా నభ నటేష్ కొద్దిసేపే కనిపిస్తుందట. లీడ్ రోల్ లో ఆర్ఎక్స్ 100బ్యూటీ పాయల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

అలాగే ఇటీవల వచ్చిన మరో రెండు ఆఫర్స్ లో కూడా పక్క హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకునేలా ఉన్నాయట. సింగిల్ లీడ్ లో నటిస్తే గాని స్టార్ హీరోలతో అవకాశాలు రావు. మరి బేబీ తన అసలైన కెరీర్ ను ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో చూడాలి. రవితేజ డిస్కో రాజా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. త్వరలో సినిమాకు సంబందించిన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.